ఉప్పెన డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రాణానికి ప్రాణమైన వ్యక్తిని కోల్పోయిన బుచ్చిబాబు

కొంత కాలంగా సినీ రంగానికి సంబంధించి ఎన్నో విషాదాన్ని నింపే దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలోనే సినిమాలతో సంబంధం ఉన్న ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, దర్శకులు, నిర్మాతలు కన్నుమూశారు. అదే సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇళ్లలోనూ విషాదకర సంఘటనలు చాలానే జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌లో మొదటి చిత్రంతోనే వంద కోట్లు కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు సన ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది.

డైరెక్టర్ బుచ్చిబాబు సన తండ్రి పెదకాపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని స్వగృహంలో నివాసం ఉంటున్నారు. వయసు మీద పడడంతో ఆయనకు కొద్ది రోజుల క్రితమే ఆరోగ్యం క్షిణించింది. ఈ క్రమంలోనే వృద్దాప్యానికి సంబంధించిన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు పలుమార్లు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స అనంతరం కోలుకున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఉదయం ఆయన ఆరోగ్యం మళ్లీ క్షిణించింది. దీంతో పెదకాపు తన స్వగృహంలోనే తుదిశ్వాసను విడిచినట్లు సమాచారం.

Tollywood Director Buchi Babu Sana Father Passes Away

తన తండ్రి మరణించిన విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఇక, తండ్రి మరణ వార్తను తెలుసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ఇక, ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నట్లు చెప్తున్నారు.

ఇదిలా ఉండగా.. బుచ్చిబాబు సన సినిమాలపై ఉన్న మక్కువతో హైదరాబాద్ వచ్చాడు. అక్కడ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా సినిమాలకు పని చేశాడు. ఈ క్రమంలోనే 'ఉప్పెన' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటుకున్నాడు. దీని తర్వాత అంటే ఇప్పుడు బుచ్చిబాబు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఇంతలోనే అతడి ఫ్యామిలీలో విషాదం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X