Director Maruthi: మారుతి ఇంట పెను విషాదం.. పెద్ద దిక్కును కోల్పోయిన డైరెక్టర్

సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. మరీ ముఖ్యంగా ఈ కొన్ని నెలల వ్యవధిలోనే చాలా మంది నటీనటులు, టెక్నీషియన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న చాలా మంది కన్నుమూశారు. అదే సమయంలో టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలోనూ విషాదకర సంఘటనలు చాలానే జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌లో తన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ మారుతి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన ఇంటి పెద్ద దిక్కు అయిన తండ్రి గురువారం ఉదయం కన్నుమూశారు.

డైరెక్టర్ మారుతి తండ్రి దాసరి వన కుచలరావు(76) మచిలీపట్నంలోని స్వగృహంలో నివాసం ఉంటున్నారు. వయసు మీద పడడంతో ఆయనకు ఈ మధ్య ఆరోగ్యం క్షిణించింది. ఈ క్రమంలోనే వృద్దాప్యానికి సంబంధించిన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స అనంతరం కుచలరావు కోలుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం తెల్లవారుజామున ఆయన ఆరోగ్యం మళ్లీ క్షిణించింది. దీంతో మచిలీపట్నంలోని స్వగృహంలోనే తుదిశ్వాసను విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఇక, తండ్రి మరణ వార్తను తెలుసుకున్న దర్శకుడు మారుతి హుటాహుటిన మచిలీపట్నం బయలుదేరారు.

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి తండ్రి దాసరి వన కుచలరావు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మారుతితో సన్నిహిత సంబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖులు మచిలీపట్నం వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక, దాసరి వన కుచలరావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రానికి జరగనున్నాయని అంటున్నారు.

Tollywood Director Maruthi Father Passes Away

కెరీర్ ఆరంభంలో డిస్ట్రిబ్యూటర్‌గా కొన్ని సినిమాలను పంపిణీ చేసిన మారుతి.. ఆ తర్వాత యాడ్స్‌ డిజైనర్‌గా, సహా నిర్మాతగా పని చేశారు. ఈ క్రమంలోనే 'ఈ రోజుల్లో' అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత 'బస్‌ స్టాప్‌' మూవీని తెరకెక్కించాడు. ఇవి మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఆ తర్వాత నిర్మాతగా మారి 'ప్రేమకథా చిత్రం', 'రొమాన్స్', 'లవ్యూ బంగారం', 'గ్రీన్ సిగ్నల్' వంటి చిత్రాలను నిర్మించాడు. ఆ తర్వాత అల్లు శిరీష్‌తో 'కొత్తజంట', వెంకటేశ్‌తో 'బాబు బంగారం', నానితో 'భలే భలే మగాడివోయ్‌', శర్వానంద్‌తో 'మహానుభావుడు', నాగచైతన్యతో 'శైలజారెడ్డి అల్లుడు', సాయిధరమ్‌ తేజ్‌తో 'ప్రతిరోజు పండగే' వంటి సినిమాలు తెరకెక్కించాడు.

ప్రస్తుతం దర్శకుడు మారుతి.. గోపీచంద్‌ హీరోగా 'పక్కా కమర్షియల్' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే, మారుతి.. ప్రభాస్ హీరోగా 'రాజా డీలక్స్' అనే కామెడీ హర్రర్ సినిమాను చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని, ప్రభాస్ గతంలో ఎన్నడూ కనిపించని రోల్‌ను ఈ మూవీలో చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందనే టాక్ ఫిలిం నగర్ ఏరియాలో గట్టిగానే వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X