గొప్ప ఆస్కార్ సినిమా.. రాజమౌళి మాత్రం చూస్తూ నిద్రలోకి.. ఆ మూవీ ఏదంటే!

ఒక సినిమా నచ్చింది అంటే డిస్కస్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ చాలా మంది మెచ్చిన సినిమా నచ్చలేదంటే మాత్రం డిస్కస్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా సినీ ప్రముఖులే మరొక సినిమాపై నెగిటివ్ కామెంట్ చేస్తే మాత్రం జనాలకు అది కూడా ఆసక్తిని కలిగిస్తుంది. ఇటీవల రాజమౌళి కూడా ప్రపంచం మెచ్చిన ఒక సినిమా గురించి ఎవరు ఊహించని విదంగా కామెంట్ చేశారు.

ఇంటర్వ్యూలతో బిజీ బిజీ..

ఇంటర్వ్యూలతో బిజీ బిజీ..

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన దర్శకుడు రాజమౌళి రెగ్యులర్ గా మీడియాకు టచ్ లో ఉంటున్నాడు. లైవ్ లో ఇంటినుంచే ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన ఆలోచనలను మీడియాకు తెలియజేస్తున్నారు. అలాగే RRR సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఆస్కార్ విన్నర్ నచ్చలేదట..

ఆస్కార్ విన్నర్ నచ్చలేదట..

2019 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న చిత్రం పారాసైట్. మొదట్లో ఈ కొరియన్ సినిమాను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రిలీజ్ అయిన వారానికి ఈ చిత్రం ప్రపంచం వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. హాలీవుడ్ ప్రముఖులు సైతం పారాసైట్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ రాజమౌళికి మాత్రం ఆ సినిమా కొంచెం కూడా నచ్చలేదట. సినిమా చూస్తే నిద్ర వచ్చిందని కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

నాలుగు ఆస్కార్ అవార్డులు..

నాలుగు ఆస్కార్ అవార్డులు..

పారాసైట్ సినిమా ఆస్కార్ భరిలో నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే కేటగిరీల్లో నాలుగు అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా ఎన్నో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దక్షిణ కొరియాలో పేద, ధనవంతుల జీవితాలకు సంబంధించిన వ్యత్యాసం గురించి అందరికి అర్థమయ్యేలా దర్శకుడు బాన్‌ జూన్‌ హో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రం ఈ సినిమా చాలా బోర్ కొట్టేసిందని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Recommended Video

#BetheREALMAN : Watch How RRR Movie Team Accepted The 'Be The Real Man' Challenge
RRR సినిమా గురించి..

RRR సినిమా గురించి..

ఇక జక్కన్న ప్రస్తుతం ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ RRR సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసిన రాజమౌళి లాక్ డౌన్ తరువాత పరిస్థితులను బట్టి సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ఇక సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేను అంటూ.. తారక్ ఫస్ట్ లుక్ పై కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. మొత్తంగా లాక్ డౌన్ తరువాత సినిమా గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామని రాజమౌళి వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X