Anasuya Bharadwaj: నేనే అనసూయ భర్తని..సంచలన విషయం బయటపెట్టిన స్టార్ డైరెక్టర్

కష్టపడితే ఎవరైనా , ఎంతటి సామాన్యులైన అసాధారణ విజయాలను సాధించవచ్చని నిరూపించారు స్టార్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్. ఇదే విషయాన్ని యువతకు కూడా చెబుతుంటారు ఈ జబర్దస్త్ బ్యూటి. ఓ సాధారణ యాంకర్ స్టేజ్ నుంచి స్టార్ సెలబ్రెటీ రేంజ్‌కి చేరుకున్నారు. తాజాగా అనసూయకి సంబంధించిన ఓ పాత ఫోటో వైరల్ కావడం.. దానికి వెనుక జరిగిన సంఘటనను ఓ డైరెక్టర్ పంచుకున్నారు. ఆ ఈ వివరాల్లోకి వెళితే :

తెలుగు న్యూస్ ఛానెల్స్‌లో ఒకటైన సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌‌గా కెరీర్ ప్రారంభించారు అనసూయ భరద్వాజ్. అనంతరం ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న అనసూయకి ఈ కార్యక్రమం దశ తిప్పింది. హాట్ హాట్ డ్రెస్సుల్లో అందాల ఆరబోతతో జబర్దస్త్‌కు గ్లామర్ సొబగులు అద్దారు ఆమె. ప్రోగ్రామ్ మధ్యలో అనసూయ వేసే జోకులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. జబర్దస్త్‌కు ఆమెకు పెద్ద అస్సెట్‌గా నిలిచారు.

Tollywood director sai rajesh comments on Anasuya Bharadwaj here s the details

నాగబాబు, రోజా వంటి స్టార్లు స్టేజ్‌పై జడ్జిలుగా ఉన్నప్పటికీ.. అనసూయ కూడా తన హవా చూపించారు. జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీతో సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు హోస్ట్‌గా చేసే అవకాశాలను దక్కించుకున్నారు అనసూయ. ఇదే సమయంలో సినిమాల్లోనూ అనసూయకు అవకాశాలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె సినీ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

రంగస్థలం తర్వాత క్షణం, విన్నర్, గాయత్రి, ఎఫ్2, యాత్ర, కథనం, చావు కబురు చల్లగా, భీష్మ పర్వం, ఖిలాడీ, విమానం, పెద్దకాపు, రజాకార్ వంటి సినిమాల్లో అనసూయ నటించింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌ చేసి తన గ్లామర్ షోతో భారీ హైప్ తీసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పలో ద్రాక్షాయణిగా నెగిటివ్‌ రోల్‌లో నటించి మెప్పించారు అనసూయ. త్వరలో రిలీజ్ కానున్న పుష్ప2లో ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందోనని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే అనసూయ.. తన సినిమాలు, షోల వివరాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. షూటింగ్స్, ఈవెంట్స్ లేకపోతే భర్త, పిల్లలతో గడపటానికి ఆమె ప్రాధాన్యతను ఇస్తారు.

Tollywood director sai rajesh comments on Anasuya Bharadwaj here s the details

కాగా.. అనసూయను తనను ఒకప్పుడు భార్యాభర్తలని చాలా మంది అనుకున్నారని గుర్తుచేసుకున్నారు డైరెక్టర్ సాయి రాజేష్. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్న కేసీఆర్ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో అనసూయతో కలిసి సాయి రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జబర్దస్త్ సమయంలో అనసూయతో కలిసి పనిచేశానని గుర్తుచేసుకున్నారు . ఆ సమయంలో ఆమెతో ఓ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని, దీంతో చాలా మంది తనను అనసూయ భర్తనేమోనని బండబూతులు తిట్టారని సాయి రాజేష్ చెప్పారు. ఆమెకు టేస్ట్ లేదు, ఇలాంటోడిని పెళ్లి చేసుకుందని కామెంట్స్ పెట్టారని ఆయన తెలిపారు. దీంతో తాను అసలు విషయం చెప్పానని సాయి రాజేష్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: sai rajesh anasuya bharadwaj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X