దూకుడు డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంట్లో విషాదం.. ప్రాణమైన వ్యక్తి మరణించడంతో శోకసంద్రంలో దర్శకుడు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు శ్రీనువైట్ల ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. అందరినీ నవ్విస్తూ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న శ్రీనువైట్ల మొదటిసారి ప్రాణమైన వ్యక్తి మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన ఇంట్లో పెను విషాదం చోటు చేసుకోవడంతో పలువురు సినీ ప్రముఖులు కూడా స్వగృహానికి చేరుకుంటున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల ఎంతగానో ఇష్టపడే ఆయన తండ్రి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

శ్రీనువైట్ల ఇంట్లో విషాదం
టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంట విషాదం నెలకొంది. తండ్రి వైట్ల కృష్ణారావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. 83 ఏళ్ళ వయసుతో ఉన్న శ్రీనువైట్ల తండ్రి మొదటినుంచి తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్నారు. ఇక కృష్ణారావు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పెరగడం వలన అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఇక చికిత్స కోసం శ్రీనువైట్ల రెగ్యులర్ చేకప్స్ చేయిస్తూనే ఉన్నారట. ఇటీవల బాగానే కొలుకుంటున్నారని కూడా కుటుంబ సభ్యులు కొంత సంతోషంగా ఉన్నారట. తప్పకుండా మళ్ళీ ఆయన ఫుల్ జోష్ లో కనిపిస్తారని శ్రీనువైట్ల చాలామందికి చెప్పుకున్నారట.

ఆదివారం ఉదయం..
ఇక ఆదివారం తెల్లవారు జామున ఆయన పరిస్థితి మరింత విషమంగా మారడంతో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు శ్రీనువైట్ల ఇంటికి చేరుకుంటున్నారు. వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ సంతాపం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పలువురు స్టార్స్ ఫోన్ చేసి సంతాపం కూడా తెలియజేశారు. ఇక శ్రీనువైట్లకు అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కూడా ప్రత్యేకంగా నివాళులర్పించారు.

తండ్రి అంటే మరో ప్రాణం..
డైరెక్టర్ శ్రీను వైట్లకు తండ్రి అంటే ఎంతగానో ఇష్టం. గతంలో ఆయన చేసిన చాలా సినిమాలలో ఫాదర్ సెంటిమెంట్ చాలా బలంగా చూపించారు. అలాగే పలు ఇంటర్వ్యూలలో కూడా తనకు ఫాదర్ అంటే చాలా ఇష్టమని తాను దర్శకుడు అవ్వడానికి కూడా ఆయనే ముఖ్య కారణమని కూడా తెలియజేశారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి వచ్చాను అని శ్రీను వైట్ల గర్వంగా చెప్పుకున్నాడు ఇక తండ్రి అంటే మరో ప్రాణం అని కూడా ఉన్నారు. అలాంటి ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి తుదిశ్వాస విడువడంతో శ్రీనువైట్ల శోక సంద్రంలో మునిగిన తెలుస్తోంది.
Recommended Video

మళ్ళీ కామెడీ సినిమాలతో..
ఇక గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న శ్రీనువైట్ల చివరగా అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలని కామెడీ సినిమాలతో రాబోతున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు కోసం డీ అండ్ డీ కథను రూపొందిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఢీ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈసారి అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నారు. అలాగే మహేష్ బాబు కోసం కూడా రెండు కథలను రాసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











