టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం.. 100 కోట్ల డైరెక్టర్ ఇంట్లో దుర్ఘటన

సినీ రంగానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎన్నో విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా రెండు నెలల వ్యవధిలోనే సినిమాలతో సంబంధం ఉన్న ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, దర్శకులు, నిర్మాతలు కన్నుమూశారు. అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలోనూ విషాదకర సంఘటనలు చాలానే జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌లో తన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది.

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తండ్రి అనకాపల్లిలోని స్వగృహంలో నివాసం ఉంటున్నారు. వయసు మీద పడడంతో ఆయనకు కొద్ది రోజుల క్రితమే ఆరోగ్యం క్షిణించింది. ఈ క్రమంలోనే వృద్దాప్యానికి సంబంధించిన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స అనంతరం కోలుకున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం మళ్లీ క్షిణించింది. దీంతో అనకాపల్లిలోని స్వగృహంలోనే తుదిశ్వాసను విడిచారు.

Tollywood Director Trinadha Rao Nakkina Father Passes Away

దర్శకుడు త్రినాథరావు నక్కిన తండ్రి మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఇక, తండ్రి మరణ వార్తను తెలుసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన హుటాహుటిన అనకాపల్లి బయలుదేరారు. ఇక, ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. త్రినాథరావు నక్కినతో సన్నిహిత సంబంధం ఉన్న సందీప్ కిషన్ సహా పలువురు సినీ ప్రముఖులు మచిలీపట్నం వెళ్తున్నట్లు తెలుస్తోంది.

సినిమాలపై ఆసక్తి ఉన్న త్రినాథరావు 'ప్రియతమా నీవచట కుశలమా' అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత 'మేమ్ వయసుకు వచ్చాం', 'నువ్విలా నేనిలా' మూవీలను తెరకెక్కించాడు. ఇవి ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన వరుసగా 'సినిమా చూపిస్తా మావ', 'నేను లోకల్', 'హలో గురూ ప్రేమకోసమే', 'ధమాకా' వంటి చిత్రాలతో హిట్లు అందుకున్నారు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు సందీప్ కిషన్‌తో ఓ మూవీ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X