Don't Miss!
- News
త్రిపుర పోరు ఆసక్తికరం- ప్రత్యేక తిప్రాల్యాండ్ డిమాండ్ కు బీజేపీ నో-ఒంటరి పోరుకు రెడీ
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Sports
ఆ అవకాశాన్ని చేజార్చుకోవడంపై ఇప్పటికీ బాధపడుతున్నా: పృథ్వీ షా
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Technology
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Trivikram Srinivas: ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసిన త్రివిక్రమ్.. ధర ఎంతంటే!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం సినిమాలతోనే కాకుండా కమర్షియల్ యాడ్స్ తో కూడా తన ఆదాయాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క యాడ్ కు అత్యధిక స్థాయిలో పారితోషికం అందుకుంటున్న దర్శకులలో త్రివిక్రమ్ మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల యాడ్స్ కు తరచుగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తూ ఉంటాడు.
అయితే రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ఖరీదైన బీఎండబ్ల్యూ కారణం కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ బీఎండబ్ల్యూ 7 సీరీస్ 740 లీటర్లు కలిగిన మోడల్ కారును కొనగలు చేసినట్లు సమాచారం. ఇక ఈ లగ్జరీ కారు ధర ప్రస్తుతం మార్కెట్లో అయితే 1.34 కోట్ల నుంచి స్టార్ట్ అవుతోంది.

ఇదివరకే త్రివిక్రమ్ కొన్ని ఖరీదైన కారులను కొనుగోలు చేశాడు. ఇక ఇప్పుడు ఆయన భార్యతో కలిసి మరొక కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక కొత్త సినిమాలు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గత నెలలోనే త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఒక సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ ప్రాజెక్టు అనుకొని కారణాల వలన క్యాన్సిల్ అయింది. ముఖ్యంగా కథ విషయంలో మహేష్ సంతృప్తిగా లేకపోవడంతో త్రివిక్రమ్ మారొక కథను సెట్స్ పైకి తీసుకువచ్చాడు.
ఇక ఆ కథకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నారు. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. మహేష్ బాబు కంటే ముందే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అయిన విషయం తెలిసిందే. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ కథను రిజెక్ట్ చేయడంతో త్రివిక్రమ్ మహేష్ బాబుతో కోటీహ సినిమాను పట్టాలు ఎక్కించాడు. మరి SSMB 28 28 సినిమాతో త్రివిక్రమ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.