Drugs Caseలో రానా సుదీర్ఘ విచారణ.. అలా అడిగితే చెప్పడం లేదని కొత్త నిర్ణయం.. రేపు రవితేజకు కూడా అలానే?
తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈరోజు నటుడు రానాను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు ఏడున్నర గంటలకు ఈ విచారణ కొనసాగింది. ప్రధాన నిందితుడు కెల్విన్ తో లావాదేవీల గురించి రానాను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

రానా బ్యాంకు ఖాతాలను కూడా
ఈరోజు విచారణ సందర్భంగా తనకు అసలు కెల్విన్ ఎవరో తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. అయితే, మనీ లాండరింగ్ కోణంలో రానా బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు పరిశీలించి, అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ లో పార్టీ విషయమై రానాను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

సుదీర్ఘంగా విచారణ
అయితే కెల్విన్ ఎవరో తమకు తెలియదని చెబుతూ ఉండడంతో విచారణ జరుపుతున్న సమయంలో వారిని హాజరుపరచాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే ఈడీ కార్యాలయానికి మరో సారి కెల్విన్ విచారణకు హాజరయ్యారు. నిన్న రాత్రి వరకు సుదీర్ఘంగా విచారణ చేసిన ఈడీ ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో విచారణకు వచ్చినట్టు చెబుతున్నారు.

కెల్విన్ ఎవరో తెలియదని
గతంలో కెల్విన్ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఆరు నెలల క్రితం కెల్విన్ పై Prevention of Money Laundering Act( మనీ లాండరింగ్ చట్టం) కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇక సినీ ప్రముఖులు సంబంధాలు పై కెల్విన్ విచారణ కొనసాగుతోంది. అయితే కెల్విన్ వ్యవహారం పై ప్రశ్నిస్తే తమకు కెల్విన్ ఎవరో తెలియదని సినీ ప్రముఖులు చెబుతున్న నేపధ్యంలో దీంతో రోజు విచారణకు హాజరు కావాలని కెల్విన్ కు ఆదేశాలు జారీ చేశారు.

అతన్ని ఉంచే
సినీ ప్రముఖుల ముందు కెల్విన్ ను ఉంచి విచారణ చేయాలని భావిస్తున్న ఈడీ అధికారులు రేపటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు , కెల్విన్ ను కలిపి విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రేపు విచారణకు ప్రముఖ నటుడు రవితేజ, అతని డ్రైవర్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి హాజరు కానున్నారు. వీరే కాక నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ కూడా విచారణకు హాజరు కానున్నారు.
Recommended Video

ఎవరెప్పుడు అంటే
ఇక ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖుల విచారణ తేదీలు ఇలా ఉన్నాయి, నవదీప్ - సెప్టెంబర్ 13, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ - సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ - సెప్టెంబర్ 15, తనీష్ - సెప్టెంబర్ 17, నందు - సెప్టెంబర్ 20, తరుణ్ - సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కానున్నారు. ఇక ఈ వ్యవహారం ఎందాకా వెళ్లనుంది అనేది మాత్రం సంచలనంగా మారింది. మరి ఇప్పటికే విచారణ జరిపిన విషయంలో కూడా ఎలాంటి వివరాలు వెల్లడి అయ్యాయి అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











