బాలీవుడ్ F2 రీమేక్: హీరోగా సీనియర్ నిర్మాత కుమారుడు.. దర్శకుడు ఎవరంటే?
వరుణ్ తేజ్ వెంకటేష్ మొదటిసారి కలిసి నటించిన సినిమా F2 సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దిల్ రాజు ప్రొడక్షన్ లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దిల్ రాజుకు పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ ను అందించింది. అయితే ఆ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నెగిటివ్ రివ్యూలు వచ్చినా కూడా
కామెడీ మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన F2 సినిమా బాక్సాఫీస్ వద్ద 100కోట్ల బిజినెస్ చేస్తుందని ఎవరు ఊహించలేదు. సినిమాకు మొదట్లో కొన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ఈ సినిమాతోనే వెంకటేష్ కూడా ఫామ్ లోకి వచ్చేశారు.
ఇక సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇతర భాషల్లో కూడా మంచి గిరాకీ లభించింది.
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఫ్యాన్స్ హంగామా... ఆకట్టుకొన్న డ్రమ్మర్ శివమణి

దిల్ రాజు సజెస్ట్ చేయడంతో
ఇక గత ఏడాది నుంచి బాలీవుడ్ రీమేక్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన హిందీ రీమేక్ హక్కులను బోణి కపూర్ దక్కించుకున్నారు. బోణి కపూర్ కు స్వయంగా దిల్ రాజు ఈ సినిమాను సజెస్ట్ చేశాడు. దీంతో అనీస్ దర్శకత్వంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఆలస్యం అయ్యింది
బోణి కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ మొదటి హీరోగా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే మరొక హీరోగా చేయబోయేది ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. సినిమా కథను పూర్తిగా హిందీ ఆడియెన్స్ కు నచ్చే విధంగా రెడీ చేశారట. అసలైతే సినిమాను గత ఏడాది లోనే సెట్స్ పైకి తెచ్చే వారు. కానీ కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు.

F3 కూడా అదే స్టైల్ లో..
ఇక ప్రస్తుతం F2 ప్రాంఛైజ్ ను ఉపయోగించుకొని దర్శకుడు అనిల్ రావిపూడి అదే క్యాస్టింగ్ తో F3ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో డబుల్ డోస్ ఫన్ ఉంటుందని పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు. డబ్బుకు సంబంధించిన పాయింట్ ను తీసుకొని సరికొత్త స్టోరీని అల్లినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను ఆగస్ట్ 27న రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











