twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేటి నుంచి షూటింగ్ లు బంద్.. న్యాయం కోసం తెలుగు ఫిలిం ఫెడరేషన్ పోరాటం

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి షూటింగ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినిమా కార్మికులు అందరు కూడా ఒక్కసారిగా బంద్ కు పిలుపునిచ్చారు. కరోనా కాలంలోనే దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్స్ లేక తెలుగు చిత్ర పరిశ్రమ చాలావరకు కష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉపాధి లేకుండా చాలామంది సినీ కార్మికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

    అయితే ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న ధరలు కారణంగా వచ్చే జీతాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు అని అందుకే సినీ కార్మికుల జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా నిర్మాత మండలితో కూడా ప్రత్యేకంగా ఈ విషయంపై చర్చలు జరుపుతున్నప్పటికి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో 24 క్రాఫ్ట్స్ యూనియన్ సభ్యులు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రమదోపిడి జరుగుతోంది అని ప్రస్తుత కాలంలో మార్కెట్ లో ధరలు ఆకాశాన్ని దాటేశాయని.. దానికి తగ్గట్టు వేతనాలు మాత్రం పెరగడం లేదని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ.. ఆర్థిస్తున్నామని కూడా వారి కష్టాలు గురించి తెలియజేస్తున్నారు.

     tollywood film federation cine workers strike behind the reason

    ఇక బుధవారం చిత్ర పరిశ్రమకు చెందిన 24 విభాగాల కార్మికులు అందరూ కూడా ఈ విషయంపై ఏదో ఒక క్లారిటీ ఇచ్చేవరకు షూటింగ్లకు వెళ్లబోమని తెలియజేశారు. అంతేకాకుండా ఉదయమే కృష్ణా నగర్ లోని యూనియన్ ఆఫీసులకు సినీ కార్మికులు అందరూ కూడా చేరుకున్నారు. ఇక జూనియర్ ఆర్టిస్టులను తీసుకు వెళ్లే బస్సులను సైతం కార్మికులు అందరూ కూడా అడ్డుకున్నారు

    సినీ కార్మికుల వేతనాల విషయంలో న్యాయం జరగాలి అని లేదంటే షూటింగ్ కూడా జరగనివ్వబోమని సినీ కార్మికులు అందరూ కూడా మూకుమ్మడిగా బంద్ ను ప్రకటించారు. దీంతో ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలి తో సమావేశం కానున్న తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు ఈ విషయంలో వీలైనంత త్వరగా ఒక కొత్త ప్రతిపాదనను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

    English summary
    tollywood film federation cine workers strike behind the reason
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X