టాలీవుడ్ కు వాళ్లతో ముప్పు? ఇప్పుడిదే పెద్ద సమస్య.. నిర్మాతల్లోనూ భయం
తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రస్తుతం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలోని ప్రధాన భాషల్లోకెల్లా తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు రూపుదిద్దుకుంటుండటం విశేషం. మరోవైపు ఇండియాలో ఏ భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైన అందులో తెలుగు పాపులర్ నటీనటులు, నిర్మాతల పాత్ర ఉంటుండటం గొప్ప విషయం. ముఖ్యంగా టాలీవుడ్ నుంచే ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించే సినిమాలు రూపుదిద్దుకుంటుండం సంతోషకరం. అయినప్పటికీ టాలీవుడ్ చిత్రాలను థియేటర్లలో ఆడించడం మున్ముందు కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ విషయాన్ని ప్రస్తావించడం చర్చగా మారింది. అందుకు కారణం ఏంటీ? ఎవరు టాలీవుడ్ చిత్రాలను థియేటర్లలలో ఆడనివ్వకుండా చేయబోతున్నారు? అనే వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ లో రిలీజ్ డేట్ ల సమస్య..
టాలీవుడ్ లో ఏడాదికి సుమారుగా 50 నుంచి 100 వరకు సినిమాలు విడుదలవుతున్నాయి. గతంతో పోల్చితే ఇప్పుడు సినిమాల సంఖ్య భారీగానే తగ్గిందని నిపుణులు తెలుపుతున్నాయి. స్టార్ హీరోలు తమ సినిమాలకు ఎక్కువ సమయం తీసుకుంటుండటం, చిన్న సినిమాలకు ఆదరణ తక్కువవడం అందుకు కారణమని తెలుస్తోంది. ఇక రూపుదిద్దుకున్న చిత్రాలను సాఫీగా విడుదల చేద్దామంటే టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల చిన్న సినిమాలు నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఏడాదికి ఉండేదే మూడు పెద్ద పండుగలు సంక్రాంతి, దసరా, దీపావళి.. అలాగే సమ్మర్.

ఆ తేదీలను ఎలాగూ స్టార్ హీరోలు బుక్ చేసుకుంటున్నారు. ఒకే సమయంలో అందరూ స్టార్ హీరోలు థియేటర్లలోకి వస్తుండటంతో క్లాష్ కూడా అవుతున్న సందర్భాలున్నాయి. ఇటీవల చిరంజీవి, బాలయ్య సినిమాల విషయంలో అదే జరిగింది. ఇలా పెద్ద సినిమాలకే సరైన డేట్లు సర్దలేక పోతున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. మరోవైపు చిన్న సినిమాల రిలీజ్ డేట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇక ఇతర భాషల చిత్రాలకూ ఇక్కడ మంచి డేట్లతో రిలీజ్ కు అనుమతినివ్వడతంతో మన చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కొత్త సినిమాలకు రీరిలీజ్ ల ఎఫెక్ట్..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. దీంతో ఈ చిత్రాల రీరిలీజ్ డేట్లను కూడా ప్రత్యేకమైన రోజుల్లో, మరీ ముఖ్యంగా వీకెండ్ లో శుక్రవారామే రిలీజ్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతోనూ కొత్త సినిమాల విడుదలకు తేదీలను సర్దడం కష్టంగా మారుతోందని నిర్మాతలు తెలుపుతున్నారు. కనీసం రీరిలీజ్ సినిమాలకు కేటాయించే తేదీల నుంచైనా ఒత్తిడి తగ్గించాలని చిన్న సినిమాల నిర్మాతలు కోరుతున్నారు. ఇటీవల మంచు మనోజ్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత నట్టి కుమార్ ఇదే అంశాన్ని లేవనెత్తారు.
అసలు సమస్య అదే : సినీ ప్రముఖులు
పెద్ద సినిమాల ఎంట్రీ, రీ రిలీజ్ ల ఎఫెక్ట్, ఇతర భాషల చిత్రాలకూ ప్రాధాన్యత ఇవ్వడంతో కొత్త సినిమాలు, ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకు అన్యాయం జారుతుందని అంటున్నారు. ఈ సమస్యకు మరో ప్రధాన కారణం ఉందని తాజాగా ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఓటీటీల ద్వారానే కొత్త సినిమాలకు డేట్లు సర్దలేక పోతున్నామని, దాంతో ప్రేక్షకులు కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశం తగ్గిపోతుందని అంటున్నారు. ఫలితంగా ఆడియెన్స్ కు కొత్త సినిమాలను సరైన టైమ్ కు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీటీల్లో వచ్చే కొత్త కంటెంట్, సినిమాల వల్ల ప్రేక్షకులకు థియేటర్లలోకి రాకపోతే టాలీవుడ్ ప్రమాదంలో పడుతుందని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











