Naga Chaitanya: యూట్యూబర్‌గా మారిన నాగ చైతన్య.. అవకాశాలు లేకే అలా చేస్తున్నాడా?

సాధారణంగా ఏదైనా ఒక సినిమా విడుదల అవుతుందంటే చాలు ప్రమోషన్లు, ఇంటర్వూలతో దర్శక,నిర్మాతలతో పాటు హీరోహీరోయిన్లు ఫుల్ బిజీగా మారిపోతుంటారు. తమ సినిమాకు సంబంధించిన హీరోహీరోయిన్లు కానీ, నటీనటులు కానీ ప్రమోషన్లలో పాల్గొనలేదంటే ఈ సినిమా ఫ్లాప్ అయితే మొత్తం వారి మీదే తోసేస్తారు. అందుకే చాలా మంది హీరో, హీరోయిన్లు, దర్శక, నిర్మాతలు తమకు నచ్చకపోయినా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలో పాల్గొంటారు.

అయితే సినిమా ఎలా ఉన్నా ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు చేస్తే సినిమా హిట్టుగా మారుతుందా అంటే అదీ కాదు. కానీ మతకు చేతనైంత వరకు ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు టీం మొత్తం కృషి చేయాలనే ఇలా ఎక్కువగా చేస్తుంటారు. ఈక్రమంలోనే తమకు నచ్చినా, నచ్చకపోయినా ఎక్కవ మంది టీంతో కలిసి ఓసారి, ఒంటరిగా ఓసారి అన్నట్లుగా తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ప్రస్తుతం ఇదే కోవలోకి వెళ్తున్నారు హీరో అక్కినేని నాగ చైతన్య.

 Tollywood Hero Akkineni Naga Chaitanya Started Youtube Channel

టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న ఈయన తాజాగా యూట్యూబర్ గా మారాడు. అసలు సోషల్ మీడియా అంటేనే నచ్చని ఈయన... ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నప్పటికీ చై ఎక్కువగా వాటిని వాడడు. ఎప్పుడో ఓసారి తన సినిమాల గురించి మాత్రమే వాటి ద్వారా అప్ డేట్లు ఇస్తుంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే ఈయన తీసుకున్న ఈ నిర్ణయం వెనుక గల కారణాలు ఏంటీ అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

స్వయంగా తన పేరు మీదే ఓ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకున్న అక్కినేని నాగ చైతన్య శుక్రవారం రోజు ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి నాగ చైతన్యను ఇంటర్వ్యూ చేయగా.. పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే ఆయన కేవలం తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకోవడానికి మాత్రమే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించినట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత జుట్టు, గడ్డంతో కనిపిస్తున్నారు రీజన్ ఏంటని అడగ్గా.. ఆరు నెలలుగా జాబ్ లేగు, ఇంట్లో ఖాళీగా ఉన్నా, పనేంలేక జుట్టు, గడ్డం పెంచానంటూ కామెడీ చేశాడు చై.

 Tollywood Hero Akkineni Naga Chaitanya Started Youtube Channel

అలాగే అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో రాబోతున్న NC23 సినిమా కోసమే జుట్టు, గడ్డం పెంచినట్లు ఆ తర్వాత చెప్పారు. అలాగే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో షూట్ జరగ్గగా... రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయన్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి మరోసారి చై పక్కన హీరోయిన్ గా నటించబోతున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను మొదటి సారిగా చేసిన దూత వెబ్ సిరీస్ గురించి కూడా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. దూత ఎవరో తెలియాలంటే డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ను సోషల్ మీడియాలో అడిగితే కచ్చితంగా సమాధానం చెబుతారంటూ వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X