నాగార్జునతో చిలిపిగా టబూ.. అమల పక్కన ఉండగానే.. ఫోటో వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఎక్కువ స్థాయిలో మంచి గుర్తింపు అందుకున్న నటులలో నాగార్జున కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. ఇక ఆరు పదుల వయసు వచ్చినా కూడా ఇంకా మన్మధుడు ట్యాగ్ తోనే కొనసాగుతున్న నాగర్జున ఇప్పటికీ కూడా యువహీరోలకు తన గ్లామర్ తో షాక్ ఇస్తున్నాడు. అయితే నాగార్జునకు సంబంధించిన ఒక ఓల్డ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పక్కనే టాబు చిలిపిగా స్టిల్ ఇవ్వడం అలాగే పక్కన అమలా కూడా నవ్వుతూ కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే..

చాలా స్నేహంగా..
అక్కినేని నాగార్జున సినిమా ఇండస్ట్రీలో దాదాపు అందరి నటీనటులతో కూడా చాలా స్నేహంగా ఉంటాడు అని తెలిసిన విషయమే. వీలైనంతవరకు ప్రైవసీ లైఫ్ తోనే ఇష్టపడుతూ ఉంటారు. సినిమాలు వ్యాపారాలు తప్పితే ఆయన పెద్దగా ఎలాంటి కాంట్రవర్సీలలో కూడా తల దూర్చరు. అలాగే నాగార్జున మంచి బిజినెస్ మైండ్ అని చాలా మంది సినీ ప్రముఖులు కూడా చెబుతూ ఉంటారు.

ఎన్ని గాసిప్స్ వచ్చినా..
అయితే అక్కినేని నాగార్జున సినిమా కెరీర్ ఎలా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ లో గాసిప్స్ కూడా చాలానే ఉన్నాయి. ఆ విషయాలను గురించి నాగార్జున ఎప్పుడు కూడా పెద్దగా సీరియస్ అవ్వలేదు. చాలా కామెడీగా నవ్వుకుంటూ ఉంటాను అని చాలా ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఇక తన భార్య అమల అక్కినేని కూడా ఆ విషయాల గురించి పెద్దగా పట్టించుకోదు అని కూడా ఆయన ఇదివరకే వివరణ ఇచ్చారు.

ఈ వయసులో కూడా..
ఇక అక్కినేని నాగార్జున ఆరుపదల వయసులో ఉన్నా కూడా ఇంకా తన ఫిట్నెస్ తో అలాగే హ్యాండ్సమ్ లుక్స్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఈ వయసులో ఆ గ్లామర్ ఏమిటి అని చాలామంది యువ హీరోలు ఆయనను డైరెక్ట్ గా సలహాలు అడుగుతూ ఉంటారు. ఇక నాగార్జున అయితే పెద్దగా డైటింగ్ లాంటివి ఏమి చేయను అని హ్యాపీగా పాజిటివ్ గా ఉంటూ వ్యాయామం చేసుకుంటూ ఉంటాను అని తెలియజేశారు.

టబుతో స్నేహం
ఇక అక్కినేని నాగార్జున కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక హీరోయిన్ టబుతో నాగార్జునకు మంచి ఫ్రెండ్షిప్ ఉన్న విషయం తెలిసింది. వీరి కలయికలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తర్వాత ఆమె ఎక్కువగా బాలీవుడ్లోకి వెళ్ళినప్పటికీ కూడా తరచుగా నాగార్జునతో పార్టీలలో కూడా పాల్గొంటూ ఉండేవారు.

నాగార్జునతో పోటీ వైరల్
ఇక టబు నాగార్జున స్నేహం గురించి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీతో కూడా టబు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అమల అక్కినేనికి కూడా ఆమెతో మంచి అనుబంధం ఉంది. ఇక ఈ ముగ్గురికి సంబంధించిన ఒక ఫోటో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టబు వెనకాల నుంచి నాగార్జునను ఆప్యాయంగా చిలిపిగా పట్టుకుని ఉండగా పక్కనే అమల నవ్వుతూ కనిపించారు. ఇక ప్రస్తుతం ఈ పాత ఫోటో సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది.

నెక్స్ట్ సినిమా...
ఇక అక్కినేని నాగార్జున సినిమాల విషయానికి వస్తే చివరగా నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం ప్రముఖ రైటర్ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టు షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది.


Click it and Unblock the Notifications











