For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రేకింగ్ : టాలీవుడ్ హీరో కృష్ణుడు అరెస్ట్.. పక్కా ప్లాన్ ప్రకారం దాడి.. ఇప్పుడు ఎక్కడున్నారంటే?

  |

  టాలీవుడ్ లో నటుడిగా చాలా సినిమాల్లో కనిపించి కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన కృష్ణుడు దాదాపు అందరికీ సుపరిచితమే. అయితే ఆయనను అరెస్టు చేసినట్లు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనను ఎందుకు అరెస్టు చేశారు? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు ? అనే వివరాల్లోకి వెళితే

   నటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారి

  నటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారి

  సినీ నటుడిగా కృష్ణుడు దాదాపు అందరికీ సుపరిచితమే. వినాయకుడు అనే సినిమాతో హీరోగా మారిన కృష్ణుడు తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అదే తరహా సినిమాలు మరో రెండు మూడు హీరోగా నటించాక ఇక అలాంటి సినిమాలు వర్కౌట్ అవ్వవు అని భావించి మళ్ళీ మామూలుగానే చిన్నా చితకా పత్రాలు చేస్తూ ఉండే వారు.

   సినిమాలకు దూరం

  సినిమాలకు దూరం

  అయితే ఆయన ఇపుడు నటనకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఆయన తన కుమార్తె పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి సినిమాలు ప్రారంభిస్తానని కొన్ని రోజుల క్రితం ప్రకటించారు కూడా. ప్రస్తుతం ఆ పనుల్లో ఆయన బిజీ బిజీగా గడుపుతున్న టు తెలుస్తోంది

   పెద్ద ఎత్తున ప్రచారం

  పెద్ద ఎత్తున ప్రచారం

  గత ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి మద్దతు తెలిపిన కృష్ణుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు కూడా.. సినీ గ్లామర్ ఉండడంతో ఆయన చేత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రచారం కూడా చేయించింది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అధికార పార్టీ.

   వైసీపీకి మద్దతు

  వైసీపీకి మద్దతు

  పార్టీ అధికారంలోకి వచ్చాక కృష్ణుడికి కూడా ఏదైనా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అలాంటి ఏ బాధ్యతలు అయితే అప్పగించలేదు. దీంతో ఆయన సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. నిజానికి 2005 సంవత్సరంలో మొదటి సినిమా అంటూ నవదీప్, పూనమ్ బాజ్వా హీరోహీరోయిన్లుగా వచ్చిన సినిమాలో కృష్ణుడు నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
  ఆ తర్వాత షాక్, పోకిరి, హ్యాపీ డేస్, వాన, యువత, అనే సినిమాలో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వినాయకుడు సినిమా మాత్రం కృష్ణుడికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విలేజ్ లో వినాయకుడు, పప్పు, కోతిమూక ఇలాంటి సినిమాలలో హీరోగా నటించినా అవి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఇక చివరిగా హల్చల్ అనే సినిమాలో నటించాడు.

  పేకాట ఆడుతున్న నేపథ్యంలో

  పేకాట ఆడుతున్న నేపథ్యంలో

  అసలు విషయం ఏమిటంటే కృష్ణుడిని నిన్న రాత్రి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్ప పార్క్ విల్లాలో పేకాట ఆడుతున్న నేపథ్యంలోనే కృష్ణుడు అరెస్ట్ అయ్యాడని అంటున్నారు. నిన్న అర్ధరాత్రి ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజు తో పాటు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకుని మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

  పక్కా ప్లాన్ ప్రకారమే

  పక్కా ప్లాన్ ప్రకారమే

  నిజానికి ఈ విషయాన్ని పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. అయితే గత కొద్ది రోజులుగా మియాపూర్లోని శిల్ప పార్క్ విల్లాలలో పెద్ద ఎత్తున పేకాట శిబిరాలు నడుస్తున్నాయని సమాచారం పోలీసుల దగ్గర ఉందని అంటున్నారు. పలువురు సినీ ప్రముఖులతో పాటు బిజినెస్ మ్యాన్ లు కూడా ఈ పేకాటలో భాగం అవుతున్నారని సమాచారంతో నిన్న రాత్రి మాదాపూర్ కి చెందిన ఎస్వోటీ పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసారు.

  Director Maruthi Launched 'Achamaina Telugu Inti Pillave' Song From Savitri w/o Satyamurthy
   విడిచి పెట్టారు కానీ

  విడిచి పెట్టారు కానీ

  ఆ దాడి సమయంలోనే కృష్ణుడు సహా ప్రధాన నిర్వాహకుడు పెద్దిరాజు కలిపి మొత్తం తొమ్మిది మంది పోలీసులకు పట్టుబడ్డారు. అయితే వ్యక్తిగత పూచీకత్తు మీద వీరిని విడిచి పెట్టారు. మళ్ళీ సాయంత్రం తమ ముందు హాజరు కావలసిందిగా నోటీసులు ఇచ్చారని అంటున్నారు. దీనికి సంబంధించి కృష్ణుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది

  English summary
  Movie star Krishnudu gets caught by police playing rummy in hyderabd, more details awaited
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X