twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ కారణంగానే తుదిశ్వాస విడిచారు అంటూ.. తండ్రి మృతిపై హీరో నిఖిల్ ఎమోషనల్

    |

    టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ ఇంట్లో గురువారం విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హఠాత్తుగా అతని తండ్రి మరణించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. తండ్రితో ఒక స్నేహాభావంతో పెరిగిన నిఖిల్ అయితే ఆ బాధను తట్టుకోలేకపోయాడు. ఇక మొదటిసారి నిఖిల్ సోషల్ మీడియా ద్వారా తన తండ్రి మృతిపై స్పంధించాడు. అలాగే మృతికి గల కారణాన్ని కూడా తెలియజేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఆ సినిమాలో చర్చల్లో ఉండగా..

    ఆ సినిమాలో చర్చల్లో ఉండగా..

    తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోగా మంచి గుర్తింపు అందుకున్న నిఖిల్ తన తండ్రి మృతితో ఒక్కసారిగా మనోవేదనకు గురయ్యాడు. గురువారం నాడు అతను కార్తికేయ 2 సినిమా కోసం ఆఫీస్ లో చర్చల్లో బిజీగా ఉండగా అప్పుడే అతనికి ఇంటి నుండి ఫోన్ వచ్చింది. తండ్రి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో వెంటనే హాస్పిటల్ కు చేరుకున్నాడు. అప్పటికే తండ్రి కన్నుమూయడంతో నిఖిల్ గుండె బద్దలయ్యేలా రోధించాడు.

    చాలా మంచి వ్యక్తి

    చాలా మంచి వ్యక్తి

    ఇక నిఖిల్ మొదటిసారి తన తండ్రి మృతిపై సోషల్ మీడియాలో స్పందించాడు. నిఖిల్ తన తండ్రితో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు. "నా తండ్రి శ్యామ్ సిద్ధార్థ నిన్న మరణించినందుకు చాలా బాధకు లోనయ్యాను. ఒక మంచి వ్యక్తి, అతను వేలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేశాడు, బోధించాడు, చాలా మందికి వారి కెరీర్‌లలో మార్గనిర్దేశం చేశాడు. అలాగే తన చుట్టూ ఉన్న ప్రజలను సంతోషంగా ఉంచడానికి ఎల్లప్పుడూ కోరుకుంటాడు.. అని నిఖిల్ పేర్కొన్నారు.

    ఆయన వల్లే నేను హీరోగా..

    ఆయన వల్లే నేను హీరోగా..


    మరొక పోస్ట్ లో నిఖిల్ ఈ విధంగా పేర్కొన్నారు. "మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లకు విపరీతమైన అభిమాని. ఒక సినిమా బఫ్, నన్ను ఏదో ఒక రోజు వెండితెరపై చూడాలనేది అతని కల. అతని ప్రేరణ వలనే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో ఉంచింది. ఒక అబ్బాయి నుండి అతను తనకు తానుగా చదువుకోడానికి, మాకు మంచి జీవితాన్ని అందించడానికి నిరంతరాయంగా పనిచేశాడు. JNTU ఎలక్ట్రానిక్ ఇంజనీర్ నుండి స్టేట్ టాపర్, అతను హార్డ్ వర్క్‌ ను మాత్రమే నమ్మాడు.. అని నిఖిల్ తెలియజేశాడు.

     మృతికి కారణం..

    మృతికి కారణం..


    తండ్రి మరణానికి గల అసలు కారణాన్ని కూడా నిఖిల్ ఈ విధంగా తెలియజేశాడు.. పండును ఆస్వాదించే సమయం వచ్చినప్పుడు అతను అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. కార్టికో బేసల్ డీజెనరేషన్... గత 8 సంవత్సరాలుగా అతను ఆ వ్యాధితో పోరాడాడు, మా కోసం ఉండడానికి తన వంతు కృషి చేసాడు, నా తల్లి కుటుంబ సభ్యులకి ఎంతో మద్దతు ఇచ్చారు. అయితే నిన్న ఆయన తుది శ్వాస విడిచారు.. అని తెలిపాడు.

     మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాను నాన్న

    మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాను నాన్న

    మీరు ఎక్కడ ఉన్నా మీకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను నాన్న. మేము నిన్ను ప్రేమిస్తున్నాము.. అలాగే చాలా మిస్ అవుతున్నాము. మేము మీ గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా గడవదు. మా క్రాస్ రోడ్ మూవీ మరియు బిర్యానీ ఔటింగ్‌లు, సుదూర ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్‌లు, ముంబైలో వేసవి... ఇవన్నీ మిస్ అవుతాయి. నేను మీ కుమారుడిగా ఎప్పుడూ గర్వపడుతున్నాను అని చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాను నాన్న," అని నిఖిల్ చాలా ఎమోషనల్ గా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

    English summary
    Tollywood hero Nikhil Siddharth emotional note on his father death
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X