మొత్తానికి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్.. ముఖ్య అతిథిగా స్టార్ హీరో..
టాలీవుడ్ లో పెళ్లికి సంబంధించిన వార్తలు ఇటీవల కాలంలో బాగానే వైరల్ అయ్యాయి. ఒకరి తరువాత మరొకరు ఉహీంచని విధంగా పెళ్లి వార్తలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక హీరోల్లో ఇప్పటికే నిఖిల్ సిద్దార్థ్ పెళ్లి చేసుకోగా.. మరో హీరో రానా దగ్గుబాటి అలాగే నితిన్ కూడా సిద్ధమయ్యారు. రానా పూర్తి చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే అతని కంటే ముందే నితిన్ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. ఇటీవల డేట్ కూడా ఫిక్స్ అయ్యింది.

ప్లాన్స్ తారుమారయ్యాయి..
కరోనా వైరస్ లేకపోయినా ఉంటే ఈపాటికే నితిన్ పెళ్లి చేసుకునేవాడు. గత కొంత కాలంగా షాలినితో ప్రేమలో ఉన్న నితిన్ ఈ ఏడాది ఫైనల్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దుబాయ్ లో కాస్ట్లీగా అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ ధాటికి ప్లాన్స్ తారుమారయ్యాయి.

పరిస్థితులు అనుకూలించకపోవడంతో..
నితిన్ షాలినిల నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ లో జరగాల్సిన వివాహ వేడుకను వాయిదా వేసుకొని జూన్ లో అయినా చేసుకోవాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇప్పుడు ఫైనల్ ఒక డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త డేట్ ఫిక్స్..
జులై 26న హైదరాబాద్ లోనే పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పనులను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి చూసుకుంటున్నారు. దాదాపు పెళ్లి వేదికను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడ నిర్వహించనున్నారు అనే విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు. కేవలం కొద్దిమంది అతిధుల సమక్షంలోనే వీరి వివాహం జరగనుందట.
Recommended Video

స్పెషల్ గెస్ట్ ఆయనే..
ఇక పెళ్లి వేడుకకు అతిధులు ఎవరనే విషయంలో కూడా ఎలాంటి అప్డేట్ లేదు. కానీ కొంతమంది స్టార్ హీరోలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో నితిన్ కి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ని అతను ఎంతగా ఆరాదిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయనను మాత్రం తప్పకుండా పిలిచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











