రకుల్ ప్రీత్ సింగ్ అన్నయ్య టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. ఎవరో తెలుసా?
అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన అందగాడు.. రాహుల్ రవీంద్రన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్యూట్ గా చాక్లెట్ బాయ్ లా కనిపించే ఈయనకు ఈ ఒక్క సినిమాతోనే పెద్ద ఎత్తున క్రేజ్ వచ్చేసింది. అనేక మంది అమ్మాయిలు రాహుల్ లాంటి వాడు ప్రియుడుగా, భర్తగా రావాలని కలలు కనేవారు. అంతటి క్రేజ్ సంపాధించుకున్న ఇతడు ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా అలా ఎలా, హౌరా బ్రిడ్జి, టైగర్, హైదరాబాద్ లవ్ స్టోరీ వంటి సినిమాల్లోనూ కనిపించాడు.
కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా పలు చిత్రాలు చేస్తూ వస్తున్న ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అనేక షాకింగ్ కామెంట్లు చేశాడు. ముఖ్యంగా తనకు ఇండస్ట్రీలో ఉన్న అనేక బంధాల గురించి వివరించాడు. ముఖ్యంగా తాను దర్శకత్వం వహించిన మన్మథుడు 2 సినిమా పై కూడా పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు. ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలినప్పటికీ.. ఆ అనుభవాలు మాత్రం చాలా గుర్తిండిపోయాయని అన్నారు. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారని వివరించారు.

ముఖ్యంగా వెన్నెల కిషోర్, సమంత, కీర్తి సురేష్, లక్ష్మి, ఝాన్సీ, దేవ దర్శిని, ఇషా రెబ్బా, రోహిణి, బ్రహ్మానందం, నాజర్, రావు రమేష్, లక్ష్మీలు ఇప్పటికీ తన స్నేహితులుగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. వీరితో ఇప్పటికీ తన బంధం చాలా స్ట్రాంగ్ గా ఉందని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తో తనకు ఉన్న స్పెషల్ బంధం గురించి తొలిసారి నోరు విప్పారు. రకుల్ ప్రీత్ సింగ్ అంటే తనకు చాలా ఇష్టం అని.. ఆమెకు కూడా అతను అంటే చాలా ఇష్టం అని వెల్లడించాడు.

తామిద్దరి బంధం చాలా స్పెషల్ అని.. సొంత అన్నాచెల్లెల్లు కాకపోయినా అంతకంటే ఎక్కువ చక్కగా ఉంటామని వెల్లడించాడు. తాను ప్రపంచంలో ఏ మూలన ఉన్నా రకుల్ ప్రీత్ సింగ్ రక్షా బంధన్ రోజు తనకు రాఖీ పంపుతుందని.. దగ్గర్లో ఉంటే కచ్చితంగా వచ్చి మరీ తన చేతికి రాఖీ కడుతుందని స్పష్టం చేశాడు. ఆ సినిమా ద్వారానే తనకో సోదరి దొరికిందని వివరించాడు. ఇప్పటికీ ఎప్పటికీ తమ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు.. కచ్చితంగా ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని అన్నాడు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











