Ram Charan ఖరీదైన కొత్త ఇల్లు.. ఎంత ఖర్చయ్యిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొత్తానికి పుట్టినరోజు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కరోనా కారణంగా అనుకోకుండా వాయిదా పడుతూ వచ్చిన RRR సినిమా అనుకోకుండా రామ్ చరణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లోనే విడుదలవడం విశేషం. ఒక విధంగా అభిమానులు భారీ విషయం తో రామ్ చరణ్ కు ప్రత్యేకమైన కానుక కూడా ఇచ్చినట్లు చెప్పవచ్చు. అయితే రీసెంట్ గా ఉపాసన రామ్ చరణ్ ఇద్దరు కూడా ఒక కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇంటి గురించి తెలిస్తే ఎవరైనా సరే అస్సీబార్యపోవాల్సిందే. భారీ స్థాయిలో ఖర్చు చేసి ప్రత్యేకంగా నిర్మించి డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

 మెగాస్టార్ వారసుడిగా

మెగాస్టార్ వారసుడిగా


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ స్టార్ హోదా ఎంత పెరుగుతున్న కూడా చాలా వరకు తండ్రి తరహాలోనే చాలా సింపుల్ గానే ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. చాలా కూల్ గా తన పని తాను చేసుకుంటూ ఇతరులకు సహాయపడుతూ మెగాస్టార్ వారసుడిగా సరైన న్యాయం చేస్తున్నాడు అని చెప్పాలి. రంగస్థలం సినిమా తర్వాత మంచి నటుడిగా గుర్తింపు అందుకున్న రామ్ చరణ్ తేజ్ RRR సినిమాలో కూడా అదే తరహాలో మంచి నటనను కనబరిచి మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు.

పుట్టినరోజు వేడుకల్లో సక్సెస్ సెలబ్రేషన్స్

పుట్టినరోజు వేడుకల్లో సక్సెస్ సెలబ్రేషన్స్


ఇక రామ్ చరణ్ తేజ్ నేడు 37వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఒక విధంగా ఈ పుట్టినరోజు రామ్ చరణ్ కు చాలా ప్రత్యేకమైంది అని చెప్పాలి. ఎందుకంటే పుట్టిన రోజుకు రెండు రోజుల ముందే బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా విడుదలవడం అలాగే బాక్సాఫీస్ వద్ద అది భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ప్రత్యేకమైనే చెప్పాలి. ఒక విధంగా అభిమానులకు కూడా ఇదే డబుల్ ధమాకా అని చెప్పవచ్చు ఒక వైపు సినిమా చూస్తూనే మరొకవైపు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొంటున్నారు.

ఎన్టీఆర్ తో పార్టీ

ఎన్టీఆర్ తో పార్టీ


ఇక రామ్ చరణ్ కు సంబంధించిన అనేక రకాల విషయాలు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్ధరాత్రి తన స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సతీమణితో కలిసి రామ్ చరణ్ ఇంటికి వచ్చి మరి బర్త్ డే పార్టీ లో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. రామ్ చరణ్ కు ప్రత్యేకంగా ఆమె పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది.

కొత్త ఇంట్లోకి వెళ్లిన ఉపాసన, చరణ్

కొత్త ఇంట్లోకి వెళ్లిన ఉపాసన, చరణ్


ఇక రామ్ చరణ్ తేజ్ ఇటీవల కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇంటిని వారికి నచ్చినట్లుగా చాలా ప్రత్యేకంగా నిర్మించుకోవడం జరిగింది. ఉపాసన కొణిదెల రామ్ చరణ్ ఇద్దరు కూడా నిత్యం ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. ఎక్కువగా ఉపాసన తన టేస్ట్ కు తగ్గట్టుగా ఇంటి నిర్మాణం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

KGF Chapter 2 : Kannada And Telugu Ruling Indian Box Office | RRR Movie | Filmibeat Telugu
ఎంత ఖర్చు చేశారంటే?

ఎంత ఖర్చు చేశారంటే?


ఇక ఇంటి కోసమే ఈ దంపతులు భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు సమాచారం. ఇదివరకే నిర్మించిన ఆ బంగ్లాను మరోసారి వారికి నచ్చినట్లుగా మార్చుకున్నారు. అందుకోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు మార్పుల కోసం మొత్తం 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇక ఆ లగ్జరీ హోమ్ ఎలా ఉంటుందో ఊహకు అందడం లేదు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 15వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X