Hero Satya No More: టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ హీరో మృతి

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు పలు కారణాలతో తుది శ్యాసను విడిచారు. మరీ ముఖ్యంగా ఈ కొన్ని నెలల వ్యవధిలోనే చాలా మంది నటీనటులు, టెక్నీషియన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న చాలా మంది మరణించారు. ఇక, గత వారం రోజుల్లో దేశంలోనే ఫేమస్ అయిన ఇద్దరు సింగర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలతో సినీ పరిశ్రమల్లో గతంలో ఎన్నడూ లేనంత ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. తాజాగా తెలుగు హీరో కన్నుమూశారు.

చాలా సంవత్సరాల కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత హీరోగా మారిన సత్య కన్నుమూశారు. ప్రస్తుతం సినిమాలు చేయకున్నా సొంత వ్యవహారాలు చూసుకుంటోన్న ఆయన.. గురువారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ వెంటనే అక్కడి వైద్యులు సత్యకు పరీక్షలు నిర్వహించి అప్పటికే ఆయన మరణించినట్లు గుర్తించారు. కార్డిక్ అరెస్ట్ వల్లే సత్య చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా మీడియాకు వెల్లడించారు.

Tollywood Hero Satya Passed Away due to Cardiatric Arrest

2004 సంవత్సరంలో వచ్చిన 'వరం' అనే మూవీ ద్వారా హీరోగా పరిచయం అయిన సత్య.. ఆ తర్వాత 'బ్యాచ్‌లర్స్' అనే సినిమాలోనూ నటించారు. అయితే, ఆయనకు ఈ సినిమాల వల్ల పెద్దగా గుర్తింపు దక్కకపోవడంతో పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సత్య కొన్ని వ్యాపారాలను ప్రారంభించి వాటిని చూసుకుంటున్నారు. అలాగే, పదేళ్ల క్రితమే వివాహం కూడా చేసుకున్నారు. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకుంటోన్న సమయంలోనే కరోనా సెకెండ్ వేవ్ సమయంలో తన భార్యను, తల్లిని కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన మానసిక క్షోభకు లోనవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సత్యకు ఎనిమిదేళ్ల వయసున్న కుమార్తె ఉంది.

టాలీవుడ్ హీరో సత్య మరణ వార్త తెలియడంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనకు సన్నిహితులైన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆయన మృతదేహానికి నివాళులు అర్పించేందుకు తరలి వెళ్తున్నారు. ఇక, సత్య అంత్యక్రియలను హైదరాబాద్‌లోని ఈఎస్ఐ దగ్గర శుక్రవారం మధ్యాహ్నం జరపబోతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సినిమాల్లో చేసిన సమయంలో పెద్దగా గుర్తింపును అందుకోలేకపోయిన సత్య ఇప్పుడు వార్తల్లో నిలవడం అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.

ఇదిలా ఉండగా.. సత్య 2004లో 'వరం' అనే సినిమాలో నటించినట్లు ముందుగానే చెప్పుకున్నాం. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇది కమర్షియల్‌గా సక్సెస్‌ కాకున్నా.. మ్యూజికల్‌గా బిగ్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని 'నచ్చినావే నవ్వుల గోపమ్మ.. గుండె నిండా నీదే ధ్యాసమ్మా' అంటూ సాగే పాట అప్పట్లో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు, సత్య కుటుంబానికి, కుమార్తెకు ఎవరైనా సహాయం చేయాలని ఆయన సన్నిహితులైన పలువురు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: satya సత్య
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X