Sharwanand: ప్రమాదం ఎలా జరిగిందంటే.. యాక్సిడెంట్ పై హీరో శర్వానంద్ క్లారిటీ..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఫిల్మ్ నగర్ జంక్షన్ లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యి శర్వానంద్ కి తీవ్ర గాయాలు అయినట్లు ప్రచారం జరిగింది. కారు బోల్తా పడిందని, స్థానికులు రక్షించి అతనిని హాస్పిటల్ కి తరలించారంటూ కథనాలు వినిపించాయి.
అయితే రోడ్డు ప్రమాదం అనేది మరీ అంత తీవ్రమైంది కాదని రోడ్డు సైడ్ ఫుట్ పాత్ ని కారు గుద్దుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో హీరో శర్వానంద్ కి ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదం జరిగినపుడు శర్వానంద్ కారు పక్కనే నిలబడి ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఈ ప్రమాద ఘటన టాలీవుడ్ సర్కిల్ లో కూడా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. దీనికి కారణం మరో కొద్ది రోజుల్లో శర్వానంద్ పెళ్లి జరగబోతోంది. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా పెళ్లి పనుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో రోడ్డు ప్రమాదం వార్త బయటకి రావడంతో అది కాస్తా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపొయింది.
ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై శర్వానంద్ ట్విట్టర్ ద్వారా మరింత క్లారిటీ ఇచ్చాడు. నా కారు రోడ్డు ప్రమాదానికి గురైంది అనే వార్త ప్రచారం అయ్యింది. అయితే ఈ ప్రమాదం చాలా చిన్నది. నేను చాలా క్షేమంగా ఇంటికి చేరుకున్నా. మీ ఆశీర్వాదాలు, దీవెనల కారణంగా నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇక నాకు ప్రమాదం జరిగిందని తెలిసి స్పందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో శర్వానంద్ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్యతో కామెడీ థ్రిల్లర్ జోనర్ లో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.


Click it and Unblock the Notifications











