Sharwanand: టాలీవుడ హీరో శర్వానంద్ కి యాక్సిడెంట్.. పరిస్థితి ఎలా ఉందంటే..

టాలీవుడ్ హీరో శర్వనంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రేంజ్ రోవర్ కారులో వెళ్తుండగా, ఆ కారు బోల్తా కొట్టింది అని వార్తలు వస్తున్నాయి. ఫిల్మ్ నగర్ లోని జంక్షన్ వద్ద కారు బోల్తా పడినట్లుగా ఉదయం నుంచి సోషల్ మీడియాలో కూడా న్యూస్ వైరల్ అవుతోంది. మూవీ షూటింగ్ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉదయాన్నే అలాంటి వార్తలు: ఇక కారులో ఆయనతో కాకుండా, మరెవరైనా ఉన్నారా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో శర్వా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారని కూడా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకముందే చాలా రకాల వార్తలు వచ్చాయి.

 sharwanand road accident

క్లారిటీ ఇచ్చిన శర్వానంద్ టీమ్

ఇక శర్వానంద్ టీమ్ నుంచి.. అందిన్న సమాచారం ప్రకారం.. హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా వున్నారు. కారుకి మాత్రం చిన్న గీతలు పడ్డాయి. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని శర్వానంద్ సన్నిహితులు తెలియజేశారు.

2 నెలల క్రితమే ఎంగేజ్మెంట్: కాగా, ఇటీవలే శర్వానంద్ కి పెళ్లి ఫిక్స్ అయ్యింది. రెండు నెలల క్రితం ఎంగేజ్మెంట్ జరగగా, మరి కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రమాదం జరగడం అందరినీ కలవరపెడుతోంది. అయితే శర్వాకు ఎలాంటి గాయాలు కాలేదు అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారని కూడా అంటున్నారు.

 sharwanand road accident

గతంలోనే ఒక యాక్సిడెంట్: గతంలోనూ,శర్వానంద్ కి మేజర్ ప్రమాదం జరిగింది. జాను సినిమా సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చాలా కాలం బెడ్ కే పరిమితమయ్యారు. తర్వాత కోలుకొని, మళ్లీ సినిమాలు మొదలుపెట్టడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడు, మళ్లీ ఈ గాయాల నుంచి కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందోచూడాలి.

 sharwanand road accident

ప్రస్తుతం ఆ సినిమాతో బిజీగా..: ఇదిలా ఉండగా, ప్రస్తుతం శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన 40 రోజలు పాటు లండన్ వెళ్లారు. ఇటీవలే ఇండియా వచ్చిన ఆయన మరి కొన్ని సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన పెళ్లి ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ మరీ ఎక్కువ అవ్వడంతో శర్వా వ్యక్తిగత టీమ్ క్లారిటీ ఇచ్చింది. తన మూవీ కమిట్మెంట్స్ అన్నీ పూర్తైన వెంటనే ఆయన పెళ్లి చేసుకుంటారని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి ఆగలేదని, త్వరోలనే జరుగుతుందని వారు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X