లాక్ డౌన్ దెబ్బపడినా సుమంత్ సినిమా ఆగలేదు.. హిట్టు గ్యారెంటీ!
టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోల్లో సుమంత్ ఒకడు. అక్కినేని బ్రాండ్ తో కెరీర్ మొదటి నుంచి చాలా సినిమాలు చేశాడు. మామ నాగార్జున సపోర్ట్ ఇచ్చినా తాత నాగేశ్వరరావు క్రేజ్ ఉన్నప్పటికీ ఎందుకో సక్సెస్ కాలేకపోయాడు. ఎలాంటి సినిమాలు చేసినా కూడా మనోడు బాక్సాఫీస్ వద్ద మార్కెట్ సెట్ చేసుకోలేకపోయాడు.
చాలా కాలం తరువాత ఆ మధ్య మళ్ళీ రావా అనే సినిమాతో క్లాస్ ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేశాడు. ఇక నుంచి కథలో కొత్తదనం ఉంటేనే సినిమాలు చేయాలని డిసైడ్ అయిన ఈ సీనియర్ హీరో నెక్స్ట్ కపటదారి అనే సినిమాతో రానున్నాడు. అసలైతే ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కంటే ముందే అయిపోయిందట. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఊహించని విదంగా లాక్ డౌన్ దెబ్బ పడింది.

దీంతో సినిమా రిలీజ్ కావడం కష్టమే అనే తరహాలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆగిపోయింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని సుమంత్ ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు చెప్పిన సుమంత్ త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











