ఆ సినిమా గురించి మాట్లాడను .. నాకే సిగ్గుగా ఉంది , శ్రీవల్లి బాయ్‌ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ బ్యాక్‌గ్రౌండ్ కానీ గాడ్ ఫాదర్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తెలుగు తెరపై స్టార్ హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. కెరీర్ తొలినాళ్లలో చిన్న చితకా పాత్రలు , సెకండ్ హీరోగా నటిస్తూ సరైన బ్రేక్ కోసం ఎన్నో కష్టాలు పడ్డారు విజయ్. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్లు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకున్న ఆయనకు తర్వాత వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

ఈ దశలో పెళ్లిచూపులు సినిమా విజయ్ దేవరకొండ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ వెంటనే సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి ఈ రౌడీ స్టార్‌కు స్టార్ డమ్‌ను తీసుకొచ్చింది. యాంగర్ మేనేజ్‌మెంట్ , ప్రేమ ఎలిమెంట్స్‌తో వచ్చిన అర్జున్ రెడ్డి టాలీవుడ్‌లో సరికొత్త సినిమాగా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రష్మిక మందన్నతో కలిసి నటించిన గీతా గోవిందం క్లాసికల్ మూవీగా భారీ వసూళ్లు సాధించింది.

Tollywood hero vijay devarakonda made sensational comments on his struggling days

వరుస విజయాలతో దూసుకెళ్లున్న విజయ్ దేవరకొండ స్పీడుకు లైగర్ బ్రేక్ వేసింది. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన లైగర్ బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. లైగర్ తర్వాత విజయ్‌ని వరుస పరాజయాలు పలకరించాయి. ఖుషి, ది ఫ్యామిలీమెన్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో విజయ్ కెరీర్ డైలమాలో పడింది.

ఈ ఏడాది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీలో అర్జునుడిగా అభిమానులు ఏ మాత్రం ఊహించని గెటప్‌లో అలరించారు విజయ్ దేవరకొండ. కనిపించింది కాసేపే అయినా అద్భుతంగా నటించారు రౌడీ స్టార్. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వీడీ 12 చేస్తున్నారు విజయ్. దీనితో పాటు శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు తన సినిమా సంగతులను, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విజయ్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో డేటింగ్ చేస్తున్నట్లుగా పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ తన కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలాలో ఓ చిన్న క్యారెక్టర్‌తోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు.

అలాంటిది నువ్విలా గురించి ఎవరు అడిగినా మాట్లాడనని విజయ్ తేల్చి చెప్పారు. తన ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం అనే అంటానని.. వెనక్కి తిరిగి చూసుకుంటే కాస్త సిగ్గుగా ఉంటుందని విజయ్ దేవరకొండ తెలిపారు. ఆ సినిమాల్లో నా పర్ఫార్మెన్స్‌లు నచ్చవని.. నువ్విలా గురించే కాదు, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ గురించి కూడా ఎప్పుడూ ప్రస్తావించనని ఆయన తేల్చిచెప్పారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X