లైలా డిజాస్టర్ .. విశ్వక్‌సేన్ క్షమాపణలు , ఇకపై తప్పు జరగదంటూ ఎమోషనల్

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం లైలా. కెరీర్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడంతో పాటు అందులో ఒకటి లేడీ గెటప్ కావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్‌సేన్ లుక్స్‌కు మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది.

వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న లైలా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమెడియన్ థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ సినిమాలో 150 గొర్రెలు ఉండాలని.. కానీ లాస్ట్ సీన్‌లో మాత్రం 11 గొర్రెలే ఉన్నాయని పృథ్వీరాజ్ అన్నారు.

Tollywood Hero vishwak sen Apology letter to audience after laila movie disaster

ఈ వ్యాఖ్యలు తమ పార్టీని, తమ అధినేత వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయంటూ వైసీపీ శ్రేణులు రగిలిపోయాయి. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూద్దామంటూ , బాయ్‌కాట్ లైలా పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్‌కు దిగారు వైసీపీ అభిమానులు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో హీరో విశ్వక్‌సేన్, నిర్మాత సాహూ గారపాటిలు మీడియా ముందుకొచ్చి వైసీపీ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు. రెండు మూడు రోజులు మొండికేసిన పృథ్వీరాజ్ కూడా సినిమా విడుదలకు ముందు సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

తీరా రిలీజ్ అయ్యాక తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది లైలా. గతంలో విశ్వక్ నటించిన సినిమాలు భారీగానే దెబ్బతిన్నాయి. కానీ వాటికి రాని వివమర్శలు ఈ మూవీకి వచ్చింది. కారణం బూతు మాటలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ప్రేక్షకులకు విసుగు పుట్టించాయి. వినోదం పేరుతో అసభ్యత హద్దులు దాటడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లైలా థియేటర్ల వైపే రావడం మానేశారు. చివరికి విశ్వక్‌సేన్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా లైలా నిలిచింది.

Tollywood Hero vishwak sen Apology letter to audience after laila movie disaster

తన సినిమాకు, తన కెరీర్‌కు లైలాతో జరిగిన డ్యామేజ్‌తో విశ్వక్‌సేన్ స్పందించారు. ఈ మేరకు ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన ప్రయాణంలో ఇన్నాళ్లుగా అండగా నిలిచిన వారికి క్షమాపణలు చెప్పిన విశ్వక్.. ఇటీవల తన సినిమాలు ప్రజలు కోరుకునే లేవని అంగీకరించారు. తన సినిమాపై వచ్చిన విమర్శల్ని పూర్తిగా అంగీకరిస్తున్నానపని.. ఇకపై తన నుంచి వచ్చి ప్రతి సినిమా, ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉంటుందని విశ్వక్‌సేన్ హామీ ఇచ్చారు.

నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యతకు తావుండదని ఆయన తెలిపారు. మంచి, చెడుల్లో నన్ను నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన విశ్వక్‌సేన్.. మీ మద్ధతు నాకెంతో ముఖ్యమని ముగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. విశ్వక్‌సేన్ జరిగిన తప్పుకు తన వంతు బాధ్యత తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ysrcp vishwak sen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X