For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నడిరోడ్డుపై విశ్వేక్ సేన్ తో యువకుడు హల్చల్.. ప్రమోషన్ పేరుతో న్యూసెన్స్ అంటూ నెటిజన్లు ఫైర్!

  |

  సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాకైనా సరే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. సినిమా ఎంత బాగున్నా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే విడుదలకు ముందే పాటలు, ట్రైలర్, టీజర్ ఇలా అన్నీ కూడా థియేటర్ కు వెళ్లి చూడాలి అనిపించే విధంగా ఉండాలి. అంతే కాకుండా ఇప్పుడు అవుట్ సైడ్ ప్రమోషన్స్ కూడా చాలా ప్రధానం గా మారాయి. సెలబ్రిటీలు కూడా జనాల్లోకి వెళ్ళి మరి సినిమా ను ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో లో విశ్వక్ సేన్ కూడా బయటి ప్రపంచంలోకి రాగా ఒక యువకుడు చేసిన హల్చల్ అంతాఇంతా కాదు. ఈ ప్రమోషన్ స్టంట్ పై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

   ఆ సినిమాతో..

  ఆ సినిమాతో..


  నటుడిగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా అడుగులు వేస్తున్న టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఒక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఎక్కువగా ఈ నగరానికి ఏమైంది సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఓటీపీ ప్లాట్ ఫార్మ్ లో మంచి క్రేజ్ అందుకుంది.

  ఇంకా అనుకున్నంతగా..

  ఇంకా అనుకున్నంతగా..

  ఇక విశ్వక్సేన్ ఆ తర్వాత విభిన్నమైన సినిమాలతో మరింతగా తన మార్కెట్ను పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఆమధ్య ఫలక్ నుమా దాస్ సినిమాతో పర్వాలేదనిపించాడు. అనంతరం హిట్, పాగల్ అనే సినిమాతో కూడా ఓ వర్గం వారిని ఆకట్టుకున్నాడు. అయితే విశ్వక్ ఇంకా అనుకున్నంత రేంజ్ లో అయితే బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ పెంచుకోలేకపోతున్నాడు.

  అశోకవనంలో అర్జున కళ్యాణం

  అశోకవనంలో అర్జున కళ్యాణం


  ఇక ప్రస్తుతం అతను మరొక సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా కోసం రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇటీవల విడుదలైన సాంగ్స్ కు కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.

  ప్రాంక్ వీడియో

  ప్రాంక్ వీడియో

  ఇక ప్రమోషన్ విషయంలో విశ్వక్సేన్ మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా నడిరోడ్డుపైనే సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక యువకుడితో కలిసి ప్రత్యేకంగా ప్రాంక్ వీడియో చేసినట్లుగా సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియో పై ఓ వర్గం నెటిజన్ల నుంచి మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి.

  పెట్రోల్ పోసుకొని చనిపోతాను అంటూ..

  పెట్రోల్ పోసుకొని చనిపోతాను అంటూ..

  ఒక యువకుడు విశ్వక్సేన్ కారుకు అడ్డంగా పడుకుని అల్లం అర్జున్ కుమార్ కు 33 ఏళ్లు అయినా పెళ్లి కాలేదు అంటూ ఆ విషయాన్ని నేను తట్టుకోలేక పోతున్నాను అని అందుకే పెట్రోల్ పోసుకొని చనిపోతాను అంటూ హడావుడి చేశాడు. ఇక విశ్వక్సేన్ తనకు ఏమీ తెలియనట్లుగా మే 6వ తేదీన నీ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి అంటూ ఆ సినిమా విడుదల తేదీని గుర్తు చేస్తూ సమాధానమిచ్చాడు.

  పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ ఏంటి?

  అయితే హడావుడి చేసిన యువకుడు కూడా సోషల్ మీడియాలో ఇదివరకే కొంత పాపులర్ అయ్యాడు. కొత్త సినిమాలు విడుదలైతే అతను ఏడుస్తూ రోధిస్తూ సినిమాలకు రివ్యూలు ఇవ్వడంతో కాస్త పాపులర్ అయ్యాడు ఇక అతనితోనే ఈ ప్రాంక్ వీడియో ను చేశాడు. అంతా బాగానే ఉంది కానీ పబ్లిక్ ప్లేస్ లో ట్రాఫిక్ అయ్యే విధంగా న్యూసెన్స్ చేయడం ఏమిటి అని ఓ వర్గం వారి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  English summary
  Tollywood hero Vishwak sen new movie promotion prank video viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X