డ్రగ్స్ తో పట్టుబడిన ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.. రిమాండ్ కు తరలించిన అధికారులు

మరోసారి సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారింది. సుశాంత్ సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల డ్రగ్స్ రాకెట్ సీక్రెట్స్ బయటపడిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల డ్రగ్స్ వ్యవహారాలు తగ్గుతున్నాయని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ మరో టాలీవుడ్ హీరోయిన్ పేరు బయటకు రావడం అందరిని షాక్ కు గురి చేసింది.

 హీరోయిన్ శ్వేతా కుమార్

హీరోయిన్ శ్వేతా కుమార్

ఆ హీరోయిన్ పేరు ఏమిటనేది గత రాత్రి నుంచి నేషనల్ మీడియాలో అనేక రకాలుగా వైరల్ అవుతోంది. ఆమె అసలు పేరు శ్వేతా కుమారి అని తెలిసింది. ఒక తెలుగు సినిమాలో కూడా నటించినట్లు సమాచారం. అలాగే బెంగాలీలో నాలుగు సినిమాలు కన్నడలో కూడా కొన్ని సినిమాలు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సినిమలైతే రిలీజ్ కాలేదని సమాచారం.

డ్రగ్స్ సరఫరా చేస్తూ..

డ్రగ్స్ సరఫరా చేస్తూ..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు నిన్న సాయంత్రం హఠాత్తుగా నిర్వహించిన సోధాల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ ని అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా వార్తలు వైరల్ అయ్యాయి.

Recommended Video

Sushant Singh Rajput: Netizens Demands Be Fair In Sushant Case| #BeFairInSSRCase
రిమాండ్ కు తరలించిన అధికారులు

రిమాండ్ కు తరలించిన అధికారులు

ఇక నేడు శ్వేతా కుమారిని కోర్టులో ప్రవేశపట్టినట్లు సమాచారం. విచారణ అనంతరం ఆమెను రిమాండ్ కు తరలించారు. అయితే డ్రగ్స్ రాకెట్ కోణంలో ఇంకా చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతంఅధికారులు అన్ని కోణాల్లో విచారణను జరుపుతున్నారు. అనుమానం ఉన్న స్టార్స్ ను కూడా త్వరలో ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

తగ్గని డ్రగ్స్ డోస్

తగ్గని డ్రగ్స్ డోస్

సుశాంత్ సూసైడ్ అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా డ్రగ్స్ కుంభకోణం బయటపడ్డ విషయం తెలిసిందే. హీరోయిన్ రియా చక్రవర్తి అలాగే ఆమె సోదరుడు ఆ కేసులో ఇరుక్కోని కొన్నాళ్లపాటు విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎవరు ఉహీంచని విధంగా ఒక చిన్న నటీమణి కూడా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా డ్రగ్స్ వ్యవహారం ఏ మాత్రం తగ్గలేదని అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X