మిస్టరీగానే భర్త మరణం.. రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా విడాకులు, బ్రేకప్స్ వంటి వార్తలే కనిపిస్తున్నాయి. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంటలు కూడా వారి జీవిత భాగస్వాముల నుంచి విడాకులు తీసుకుంటున్నారు. ఎప్పుడు ఏ సెలబ్రెటీ బాంబు పేలుస్తారో తెలియక వారి అభిమానులు బిక్కుబిక్కుమంటున్నారు. సోషల్ మీడియాలో వీరి గురించి చిన్న వార్త వస్తే చాలు ఏదో జరిగిపోతోందని భయపడుతున్నారు. అయితే విడాకులు, బ్రేకప్స్ మాత్రమే కాదు.. కొందరు తారలు పెళ్లి పీటలెక్కుతున్నట్లుగా శుభవార్తలు చెబుతున్నారు. వీరిలో రెండో పెళ్లి చేసుకుంటున్నారు వారు కూడా ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు తెలుగు నటి పావని రెడ్డి.
తొలుత సీరియల్స్‌లో నటించి తర్వాత స్టార్స్‌గా వెలుగొందుతున్న వారు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. పావని రెడ్డి కూడా తొలుత బుల్లితెరపై తన ప్రతిభను నిరూపించుకుని సినిమాల్లో అవకాశాలు పొందారు. చారి 111, మళ్లీ మొదలైంది, గౌరవం, డ్రీమ్, డబుల్ ట్రబుల్ , అమృతం చందమామలో, వజ్రం, 465, సేనాపతి వంటి చిత్రాల్లో పావని కనిపించారు. తెలుగుతో పాటు తమిళ్ తదితర భాషల్లోనూ ఈ ముద్దుగుమ్మ అవకాశాలు అందుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నటుడు ప్రదీప్ కుమార్‌తో ప్రేమలో పడ్డ పావని రెడ్డి అతనిని పెళ్లాడారు.

సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో అనూహ్యంగా సంచలన ఘటన చోటు చేసుకుంది. ప్రదీప్ కుమార్ 2017లో ఆత్మహత్య చేసుకోవడం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనేది నేటికీ మిస్టరీయే. అయితే పావని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్లే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారని ఫిలింనగర్‌లో ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తుంటాయి. ప్రదీప్ మరణం తర్వాతి నుంచి ఒంటరిగానే ఉంటున్న పావని సినిమాలు, సీరియల్స్‌పై ఫోకస్ పెట్టారు.
అయితే నిర్మాత ఆనంద్‌జాయ్‌ని పావని రెడ్డి పెళ్లాడబోతున్నట్లుగా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆనంద్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తన పాపులారిటీతో బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకున్నారు పావని రెడ్డి. తన మైండ్ గేమ్‌తో అద్భుతంగా ఆడిన ఆమె చివరి వరకు హౌస్‌లో ఉండి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. తాజాగా ఈ బ్యూటీ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది.
తమిళ్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే కొరియోగ్రాఫర్ ఆమీర్‌తో ప్రేమలో పడిన పావని రెడ్డి అప్పటి నుంచి అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అంతేకాక వీరిద్దరూ కలిసే ఉంటున్నారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు వీరిద్దరూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న వీరి వివాహం జరగనుంది. అయితే వేదిక, ముహూర్తం ఇతర వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











