టెలిఫోన్ ట్యాపింగ్‌లో ఆ హీరోయిన్ల పేరు.. సినీ ప్రముఖులకు ఆ రకంగా వేధింపులు!

తెలంగాణలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలను టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తున్నది. ఈ వివాదాస్పద వ్యవహారం తెలంగాణ, ఆంధ్రా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. తాజాగా ఈ కుంభకోణాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు చేస్తుండటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ప్రముఖ వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దర్యాప్తు వివరాల్లోకి వెళితే..

టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసుతో సంబంధమున్న వారిని, ఈ కేసులో సాక్ష్యాలుగా ఉన్న రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో మీడియాలో సంచలన విషయాలు వెలుగులోకి రాగా, మరికొన్ని ఊహగానాలు సంచలనం రేపుతున్నాయి.

Telangana Telephone Tapping Case

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి అధికార ప్రభుత్వం భారీగా, పెద్ద ఎత్తున రాజకీయ, సినీ, వ్యాపార వర్గాల టెలిఫోన్లను ట్యాప్ చేశారు. దాదాపు 600 మంది ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టి వారి సంభాషణలను రికార్డు చేశారు. ఈ వ్యవహారంలో ప్రణీత్ రావు, భుజంగ రావు‌కు అప్పటి పోలీస్ అధికారి ప్రభాకర్ రావు సహకారం అందించారు. వారికి కీలక సమాచారాన్ని చేరవేశాడనే ఆరోపణలు మీడియాలో వెలుగు చూశాయి.

తెలంగాణలో సంచలనం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్, ఏపీసీసీ ఛీఫ్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను, తమ కుటుంబ సభ్యుల ఫోన్లను అప్పటి అధికార ప్రభుత్వం నేతలు ట్యాపింగ్ చేశారు. ఈ స్కామ్‌పై పూర్తిగా ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలి అని ఈటల డిమాండ్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందిస్తూ.. ఇరు రాష్ట్రాల అప్పటి ముఖ్యమంత్రులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌తోపాటు, తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కై ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి వైసీపీ ఎంపీ నాతో అన్నారని షర్మిల పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారు. వారిని అనేక రకాలుగా వేధించారు. ఇందులో ముగ్గురు, నలుగురు హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వారిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు అని దర్యాప్తులో తేలింది. ఈ విచారణ పూర్తయ్యే లోపు సిని పరిశ్రమకు చెందిన వారి ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయనే విషయంపై స్పష్టత వస్తుంది అని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X