For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిమానులకు దసరా కానుకలు.. కొత్తపోస్టర్స్ తో హంగామా.. కత్తి, గొడ్డలి, గన్నులతో హీరోలు..

  |

  మన తెలుగు వారికి ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ప్రతీది ముహుర్తం చూసి పనులు ప్రారంభిస్తారు. ఇక పండుగలకు వారి అభిమానులకు ఖుషీ చేసేందుకు హీరోలు ప్రయత్నిస్తుంటారు. విజయ దశమి సందర్భంగా హీరోలు తమ తదుపరి చిత్రాలకు సంబంధించిన విశేషాలను, ఫస్ట్ లుక్ ను, కొత్త పోస్టర్స్ను రిలీజ్ చేసి అభిమానులను అలరిస్తారు.

  #SarileruNeekevvaru Poster Trending 1 || ట్విట్టర్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు పోటా పోటి

  విజయ దశమికి నందమూరి హీరో స్పెషల్.. ఎంత మంచివాడవురా!

  కొండా రెడ్డి బురుజు సెంటర్లో మహేష్..

  కొండా రెడ్డి బురుజు సెంటర్లో మహేష్..

  కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ అంటే.. అందరికీ గుర్తొచ్చేది ఒక్కడు సినిమాలో సూపర్ హిట్ షాట్. ఆ ఒక్క సీన్ సినిమానే వేరే లెవెల్ కు తీసుకెళ్తుంది. టెలిఫోన్ బూత్లో మహేష్ మాట్లాడుతుంటాడు.. ప్రకాశ్ రాజ్ ను కొట్టడం.. అక్కడి జనాలు ఆశ్చర్యపోవడం.. ఇలా ఆ సీన్ సినిమా టర్న్ చేస్తుంది.. మళ్లీ ఇన్నేళ్లకు అదే హిస్టరీని రిపీట్ చేసేందుకు వస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి తాజాగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఈ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారని సమాచారం. గొడ్డలిపట్టుకుని నిలబడ్డ మహేష్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులు మొదలయ్యాయని చిత్రయూనిట్ తెలిపింది.

  రౌడీల దుమ్ముదులుపుతున్న బన్నీ..

  రౌడీల దుమ్ముదులుపుతున్న బన్నీ..

  తండ్రీకొడుకుల మధ్య సాగే చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేశారేమోనని.. టైటిల్ రివీల్ చేసే టీజర్ చూస్తే అర్థమైంది. సామజవరగమన అంటూ హీరోయిన్ వెంట పడే పాట వింటే మంచి ఫీల్ ఉన్న ప్రేమకథ ఉంది.. యూత్ ను కూడా టార్గెట్ చేశారని అనుకున్నారు. అయితే అసలైంది కూడా ఉంది.. అదే మాస్ మంత్రం. గ్రౌండ్లో.. రౌడీల తాటతీస్తున్నట్లు విడుదల చేసిన అల్లు అర్జున్ స్టిల్ అదిరిపోయింది. మరి వారినెందుకు ఉతుకుతున్నాడనేది సినిమా చూస్తేనే తెలుస్తోంది. ఈ పోస్టర్ లో బన్నీ అదిరిపోయాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

  కత్తి పట్టుకున్న బాలయ్య..

  కత్తి పట్టుకున్న బాలయ్య..

  జై సింహా తరువాత చాలా గ్యాప్ తీసుకుని బాలయ్య ఓ సినిమాను పట్టాలెక్కించాడు. మళ్లీ కేఎస్ రవికుమార్ డైరెక్షన్లోనే తదుపరి సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన లీకైన బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్లో బాలయ్య శత్రు సంహారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కత్తి నుంచి రక్తం దారలుగా కారుతూనే ఉంది. దాన్ని బట్లే శత్రువులను ఊచకోత కోసినట్లుగా కనిపిస్తోంది.. మరి దాని వెనకున్న కథెంటో తెలుసుకోవాలి.

  ఫేమస్ మ్యుజీషియన్ మాధవన్..

  ఫేమస్ మ్యుజీషియన్ మాధవన్..

  మూగ పాత్రలో అనుష్క చేస్తున్న చిత్రం నిశ్శబ్దం.. ఐదు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అత్యధిక శాతం విదేశాల్లో షూట్ చేసిన ఈ సినిమాను ఇంగ్లీష్ భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మాధవన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. కాగ.. ఫేమస్ మ్యుజీషియన్ అయిన ఆంటోని పాత్రలో నటించనున్నట్లు రిలీజ్ చేసిన మ్యాడీ లుక్ అదిరిపోయింది.

  గన్ పట్టుకున్న డిస్కోరాజా..

  గన్ పట్టుకున్న డిస్కోరాజా..

  ఎన్నిసార్లు ప్రయత్నించినా మాస్ మహారాజా రవితేజకు లక్ మాత్రం కలిసిరావడం లేదు. చేసిన ప్రతీ సినిమా బోల్తా కొడుతుండటంతో ఈయన కెరీర్ ప్రమాదంలో పడింది. చివరగా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో అభిమానులను పలకరించాడు.అయితే అది డిజాస్టర్ కావడంతో మళ్లీ డైలామాలో పడ్డాడు. ఎట్టకేలకు వీఐ ఆనంద్ డైరెక్షన్లో డిస్కోరాజా చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈయన ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి రవితేజ్ లుక్ ను రివీల్ చేశారు. గన్ పట్టుకుని డిఫరెంట్ లుక్లో ఉన్న రవితేజ బాగానే ఆకట్టుకుంటున్నాడు. మరి సినిమా ఏవిదంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

  కొత్త సినిమా ప్రకటించిన నందినీ రెడ్డి..

  మహానటి చిత్రాన్నినిర్మించి ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్న స్వప్నా సినిమా.. తన తదుపరి ప్రాజెక్ట్ను ప్రకటించింది. ఇటీవలె ఓ బేబీ చిత్రంతో మంచి విజయాన్ని సాధించి.. తిరిగి ఫామ్లోకి వచ్చిన నందినీ రెడ్డితో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించిన చిన్న టీజర్ ను వదిలారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్నిఅందించనున్నాడు.

  English summary
  Tollywood Heros Treats Fans On Vijaya Dashami Occasion. They are Released New Poster From Their Latest Movies. Mahesh Babu, Allu Arjun, Nandamuri Balakrishna, raviteja Looks Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X