టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతి.. లాడ్జిలో అనూహ్యంగా!
టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టు అర్జున్ గౌడ్(30) హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. గత 20 రోజులుగా అర్జున్ అదే హృదయ అనే లాడ్జిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. పలు చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. రాత్రి సమయంలో షూటింగ్ ముగించుకుని అదే లాడ్జికి వచ్చి బస చేసే వాడని సమాచారం.
అర్థ రాత్రి షూటింగ్ ముగించుకుని లాడ్జికి వచ్చాడు. ఏవో కొన్ని మాత్రలు మింగి పడుకున్నాడట. అతడి స్నేహితుడు కార్తీక్ ఆ మాత్రలు ఏంటని అడగగా.. దగ్గు వస్తోందని అందుకే మింగానని అర్జున్ తెలిపాడట. కానీ ఉదయం చూసేసరికి అర్జున్ స్పృహలో లేకుండా కనిపించాడు.

కార్తీ వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయగా వారు పరీక్షించి అర్జున్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications