Nagarjuna Priyamani: 14 ఏళ్ల తర్వాత అలాంటి స్టోరీ కోసం కలిసి రాబోతున్న నాగార్జున, ప్రియమణి!
టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన 60 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా నటిస్తూ అదిరిపోయే సినిమాలు చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్ ప్రియమణి కూడా ఈ మధ్య అనేక సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. అయితే ఓ అద్భుతమైన కథ కోసం వీరిద్దరూ.. 14 సంవత్సరాల తర్వాత కలవబోతున్నారు. ఆ ప్రాజెక్టు ఏంటి, డైరెక్టర్ ఎవరు వంటి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కింగ్ నాగార్జున, ప్రియమణిలు కలిసి 2010లో రగడ సినిమాలో కలిసి నటించారు. కామాక్షి స్టూడియో పతాకంపై డి. శివ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో నాగార్జున సరసన.. అనుష్క శెట్టితో పాటు ప్రియమణి ప్రధాన పాత్రల్లో కనిపించారు. అలాగే తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా.. 2011లో తమిళంలో వంబుగా, హిందీలో కూడా అదే ఏడాది డబ్ చేసారు.

అనుకున్న స్థాయిలో ఈ సినిమా హిట్ కొట్టకపోయినప్పటికీ... అనేక మంది స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఏది ఏమైనా ప్రియమణి, నాగార్జునలు కలిసి చేసిన చివరి చిత్రం ఇదే. అయితే ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరుగా చాలానే సినిమాలు చేశారు. సూపర్ డూపర్ హిట్లు కూడా కొట్టారు. కానీ ఇంత కాలం తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి రాబోతున్నారు. ముఖ్యంగా ఓ అద్భుతమైన స్టోరీ కోసం వీరు కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.

నూతన డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో.. ప్రియమణి, నాగార్జునలు చేయనున్నారు. కోర్టు డ్రామాగా సాగే ఓ స్పెషల్ స్టోరీలో వీరే హీరోహీరోయిన్లు అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు తెలియాలి అంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారు, ఎవరు ప్రొడ్యూస్ చేయబోతున్నారు వంటి అన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











