twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లో మరో విషాదం: కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత

    |

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి ఈ వైరస్ తెలుగు సినీ ఇండస్ట్రీపై భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ కారణంగానే ఇప్పటికే ఎంతో మంది దీని బారిన పడి మరణించారు. మరికొందరు ఈ మాయదారి రోగంతో బాధ పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో టాలీవుడ్‌లో మరో విషాదం అలముకుంది. కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమకు చెందిన మరో సీనియర్ రచయిత మృతి చెందారు. ఆయనే.. ప్రముఖ లిరిసిస్ట్ అదృష్ణ దీపక్.

    1990 దశకంలో ఎన్నో సినిమాలు అద్భుతమైన పాటలు రాసి.. చాలా తక్కువ సమయంలోనే గొప్ప రచయితగా పేరు సంపాదించుకున్న ప్రముఖ లిరిసిస్ట్ అదృష్ణ దీపక్ కరోనాతో మరణించారు. 70 ఏళ్ల వయసున్న ఆయన కొద్ది రోజులుగా ఈ వ్యాధితో బాధ పడుతోన్నారు.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలోని ఆయన స్వగృహంలో ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలియ జేస్తున్నారు. అదే సమయంలో అదృష్ణ దీపక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

    Tollywood Lyricist Adrushta Deepak Passes Away Due to Covid 19

    'యువతరం కదిలింది' అనే సినిమాతో పాటల రచయితగా పరిచయం అయిన అదృష్ణ దీపక్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు మంచి మంచి పాటలను అందించారు. మరీ ముఖ్యంగా టీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'నేటి భారతం', 'రేపటి పౌరులు', 'దేవాలయం' లాంటి సినిమాల్లో ఆయన అద్భుతమైన పాటలను రాశారు. ఇక, 'మానవత్వం పరిమళించే మంచి మనసుకి స్వాగతం' అనే పాట ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన రెండు తరాల ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యారు.

    English summary
    Tollywood Veteran lyricist and poet Adrushta Deepak died of COVID-19 on Sunday in Ramachandrapuram in Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X