ఈషా అందాలు అక్కడ బాగానే పనిచేస్తున్నాయే! మరి ఇండస్ట్రీ సంగతేంటో..
తెలంగాణలో పుట్టి హైదరాబాద్ లోనే పెరిగింది అందాల తార ఈషా రెబ్బా. తెలుగు తెరపై ఇతర భాషా నటీమణులు రాణిస్తుండగా.. తమకేం తక్కువ అన్నట్లుగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిందీ సుందరి. ఈషాలో అందానికేం కొదవలేదు. ముంబై భామలను మించిన గ్లామర్ ఈమె సొంతం. కానీ ఆమె అనుకున్నట్లుగా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం లేదు. అయితే అవకాశాలు రాకపోవడానికి కారణం అందాల ఆరబోత తక్కువయిందని తెలుసుకుందో ఏమో గానీ ఈ మధ్య సోషల్ మీడియాలో తన అందాలతో మంచి విందు ఇస్తోంది. ఈ డోస్ గమనించిన టాలీవుడ్ మ్యాగజిన్ ఏకంగా తమ కవర్ పేజీగా ఈషా అందాలనే ఎంచుకోవడం విశేషం.
'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. బేసిగ్గా తెలుగమ్మాయి కావడంతో అదే ఆమెకు మైనస్ అయింది. పరాయి భామల మోజులో పడ్డ ఇండస్ట్రీలో ఆమెకు సరైన ఆదరణ లభించలేదని చెప్పుకోవచ్చు. 'బందిపోటు', 'అమీ తుమీ' వంటి సినిమాల్లో నటించి తన నటనా ప్రతిభను వెలికి తీసినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. ఈ తరుణంలో నాని నిర్మాణంలో తెరకెక్కిన 'అ' మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక ఈ మద్యే త్రివిక్రమ్-ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించింది. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సినిమాలో చేసింది కాబట్టి ఈషా దశ తిరిగినట్లే అని భావించారంతా. అయినప్పటికీ మళ్ళీ ఆమెకు నిరాశే ఎదురైంది.

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇంతమంది హీరోయిన్లు ఉండగా ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈషా స్థానం దక్కించుకోవడం విశేషం. స్టన్నింగ్ ఈషా రెబ్బా అని పేర్కొంటూ ఆమె గ్లామర్ లుక్‌ని పబ్లిష్ చేసింది టాలీవుడ్ మ్యాగజైన్. అంటే ఈషా అందాలకు మీడియా ఫిదా అయిందన్నమాట. ఇకనైనా ఇండస్ట్రీ చూపు ఈషాపై పడుతుందా? అనేది చూడాలి మరి.


Click it and Unblock the Notifications











