Laal Singh Chaddha:మరోసారి మెగాస్టార్ ప్రశంసలు.. స్పెషల్ షో అనంతరం ఊహించని రియాక్షన్..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ కావాలి అని అమీర్ ఖాన్ ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ఇదివరకే ఈ సినిమాను ప్రత్యేకంగా కొంతమంది అగ్ర నటులకు చూపించడం జరిగింది. ఇక రీసెంట్గా మరోసారి మరి కొంతమంది హీరోలకు కూడా అమీర్ ఖాన్ ప్రత్యేకంగా షోను ప్రదర్శించడం విశేషం.

ఇక ఆ ప్రీమియర్ షో కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున అలాగే ఇతర యువ హీరోలు కార్తికేయ సాయి ధరమ్ తేజ్ అల్లు శిరీష్ కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇక నిర్మాత అల్లు అరవింద్ దర్శకుడు హరి శంకర్, సురేష్ బాబు కూడా ఈ ప్రీమియర్ షోను ప్రత్యేకంగా వీక్షించారు. ఇక ప్రీమియర్ షో అనంతరం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి అద్భుతంగా వివరణ ఇచ్చారు.

Tollywood mega star chiranjeevi positive comments on aamir khan Laal Singh Chaddha

గతంలో తాను చెప్పినట్లుగానే ఈ సినిమాలో కథానాయకుడుగా నటించిన అమీర్ ఖాన్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతను ఒక ఖజానా లాంటి నటుడు. భారతదేశంలోనే గర్వించదగ్గ యాక్టర్ అని చెబుతున్నాను. ఇక ఈ సినిమాలో కంటెంట్ మీద నమ్మకంతోనే నేను తెలుగులో సమర్పకుడిగా ఉండడం జరుగుతుంది. లాల్ సింగ్ సినిమాలో అమీర్ ఖాన్ నటించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మంచి సినిమాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా బ్రహ్మరథం పడతారు అని చెప్పవచ్చు. అందుకు నిదర్శనంగా ఇటీవల వచ్చిన బాంబిసార, సీతారామం సినిమాలు నిలిచాయి. రెండు సినిమాలు మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక త్వరలోనే రాబోతున్న లాల్ సింగ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అమీర్ ఖాన్ నటన అద్భుతం. అలాగే బాలరాజు పాత్రలో నటించిన నాగచైతన్య కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా నటించాడు. ప్రతి పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ఉంది.. అంటూ మెగాస్టార్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X