twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాన్ ఇండియా పిక్.. మెగాస్టార్ ఇంట్లో అగ్ర హీరోల సర్‌ప్రైజ్‌.. ఫ్యాన్స్ ఫిదా

    |

    విక్రమ్ సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద కమలాసన్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజు నుంచి కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమా కు భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడం విశేషం. ఈ సందర్భంగా కమల్ హాసన్ ఒక బాలీవుడ్ స్టార్ తో కలిసే శనివారం రాత్రి మెగాస్టార్ ఇంటికి వెళ్లడం జరిగింది. ఇక మెగాస్టార్ వారికి ప్రత్యేకంగా అభినందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

    సక్సెస్ జోష్ లో కమల్ హాసన్

    సక్సెస్ జోష్ లో కమల్ హాసన్

    విశ్వనటుడు కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కొట్టి చాలా కాలం అయింది. ఇక మొత్తానికి విక్రమ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన కమల్ హాసన్ చాలా హ్యాపీగా ఉన్నారు అనే చెప్పాలి. ప్రస్తుతం విక్రమ్ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్న ఆయన ప్రముఖ హీరోల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్ కావడంతో టాలీవుడ్ హీరోలు కూడా సోషల్ మీడియా ద్వారా కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

    మెగాస్టార్ అభినందనలు

    మెగాస్టార్ అభినందనలు

    ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే ఎప్పుడు ఎవరు సక్సెస్ అందుకున్న కూడా తనదైన శైలిలో ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటారు. చిన్న దర్శకుడు చిన్న హీరోలు అలాగే స్టార్ దర్శకులు స్టార్ డైరెక్టర్స్ అని బేదాలు చూపించకుండా మెగాస్టార్ వారిని ప్రత్యేకంగా కలుసుకుని మరి తనదైన శైలిలో గౌరవిస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా కమల్ హాసన్ ను కూడా అదే తరహాలో ఆయన అభినందించడం జరిగింది.

    సల్మాన్ ఖాన్ తో కమల్ హాసన్

    సల్మాన్ ఖాన్ తో కమల్ హాసన్

    శనివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కమల్ హాసన్ వచ్చారు. ఇక ఆయన విక్రమ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కమల్ హాసన్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా రావడంతో ఆయనను కూడా ప్రత్యేకంగా గౌరవించారు.

     మెగాస్టార్ స్పెషల్ ట్వీట్

    మెగాస్టార్ స్పెషల్ ట్వీట్

    నా ప్రియమైన సల్మాన్ భాయ్ దర్శకుడు టీమ్‌తో పాటు నా ప్రియమైన పాత మిత్రుడు నిన్న రాత్రి నా ఇంటికి వచ్చారు. విక్రమ్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నా మిత్రుడికి అభినందనలు అతనికి సంపూర్ణ ఆనందం కలగాలని వేడుకలు సన్మానాలు కలగాలని కోరుకుంటున్నాను.. ఇది ఎంత గాఢమైన, ఉత్కంఠభరితమైన చిత్రం. మరింత శక్తి కలగాలని కూడా కోరుకుంటున్నట్లు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

    అసలైన పాన్ ఇండియా ఫ్రేమ్

    అసలైన పాన్ ఇండియా ఫ్రేమ్

    మెగా స్టార్ సల్మాన్ ఖాన్ కమల్ హాసన్ ఇలా ముగ్గురు అగ్ర హీరోలు కూడా ఒకే ఫ్రేమ్లో దర్శనమివ్వడంతో ఇరు వర్గాల అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకే ఫ్రేమ్లో టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ను చూసినట్లు ఉంది అని కూడా చెబుతున్నారు ఇది అసలైన ఫ్యాన్ ఇండియా ఫ్రేమ్ అని కూడా చెబుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

    English summary
    Tollywood Megastar chiranjeevi special photo with kamal haasan and salman khan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X