100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు.. ఆ హీరో, నిర్మాతలు రిస్క్ చేస్తున్నారా?
ఇప్పుడు ఉన్న రోజుల్లో ఓ సినిమా హిట్టా ఫట్టా అని తేల్చేది ఆ సినిమా తాలూకా బాక్సాఫీస్ కలెక్షన్స్ అనే చెప్పాలి. అయితే కొన్ని చిత్రాలకి ఈ వసూళ్లు కొలమానంగా తీసుకున్నప్పటికీ కొన్ని సినిమాలకి నిర్మాతలు కంటెంట్ ని కింగ్ గా తీసుకుంటారు. ఇప్పుడు మారిపోతున్న రోజులతో కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనితో కంటెంట్ బాగుంటే హీరో ఎవరు అని చూడకుండా భారీ లెవెల్లో బడ్జెట్ ని పెడుతున్నారు.
అయితే ఒకప్పుడు స్టార్ హీరోస్ మార్కెట్ మీద నడిచిపోయింది కానీ ఇప్పుడు ఓటిటిలు ఎక్కువ అవ్వడంతో జెనరల్ ఆడియెన్స్ కూడా క్వాలిటీ కంటెంట్ కోరుకుంటున్నారు. దీనితో నిర్మాతలు కూడా వీటినే వెతుకుతున్నారు. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా నిర్మాతలు కొందరు పెద్ద హీరోస్ మీద వారికీ భారీ రెమ్యునరేషన్ లు ఇచ్చి సినిమా బడ్జెట్ లకి వందల కోట్లు పెట్టడం తగ్గిస్తున్నారు.

కానీ మిడ్ రేంజ్ హీరోల సినిమాలపై మాత్రం వందల కోట్లు ఇప్పుడు పెడుతున్నారని చెప్పాలి. అది కూడా మన తెలుగు సినిమాలోనే ఇదంతా జరుగుతుంది. ఒకప్పుడు ఒక స్టార్ హీరో సినిమాకి 100 కోట్ల బడ్జెట్ అంటే ఒక ఊహించని మాట. కానీ ఇప్పుడు ఇది మిడ్ రేంజ్ హీరోస్ కి వచ్చేసింది. కాగా ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోస్ లో దాదాపు అందరి సినిమాలు 100 కోట్ల బడ్జెట్ ని టచ్ చేస్తున్నాయి.
మొదటిగా నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం నేడు విడుదల అయ్యిన సరిపోదా శనివారం బడ్జెట్ సుమారు 100 కోట్ల పైమాటే అని ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉంది. అంతే కాకుండా అక్కినేని యంగ్ హీరోలు నెక్స్ట్ సినిమాలు నాగ చైతన్య "తండేల్" అలాగే అఖిల్ నెక్స్ట్ సినిమా యూవీ క్రియేషన్స్ తో చేస్తున్నది కూడా 100 కోట్లకి పైగానే బడ్జెట్ అంటూ టాక్ ఉంది.

ఇక మెగా యంగ్ హీరోస్ సాయి దుర్గ తేజ్ నటిస్తున్న తన 18వ సినిమా అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా చిత్రాలు తమ కెరీర్ లోనే అత్యంత అధిక బడ్జెట్ లతో తెరకెక్కుతున్నాయట. వీటికి కూడా నిర్మాతలు ఇంచు మించు 100 కోట్లు పెడుతున్నారని టాక్ ఉంది. ఇక వీరితో పాటుగా లేటెస్ట్ గా మరో యువ హీరో అడివి శేష్ చేరాడు. తాను చేస్తున్న భారీ స్పై థ్రిల్లర్ "గూఢచారి 2" కూడా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు అంటూ ఇప్పుడు సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.
ఇలా మిడ్ రేంజ్ హీరోస్ తో ఇంత పెట్టి నిర్మాతలు రిస్క్ చేస్తున్నారా అనే ప్రశ్న కూడా రక మానదు. మిడ్ రేంజ్ హీరోస్ మార్కెట్ అంతంత మాత్రమే సాలిడ్ హిట్ టాక్ పడితే తప్ప ఆ హీరోస్ సినిమాలు ఇప్పుడు రాణించని పరిస్థితి. సో నిర్మాతలకి ఇది కొంచెం రిస్క్ అనే చెప్పాలి. లేదంటే అన్నీ కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా వారి పరిస్థితి ఇండస్ట్రీలో మారిపోతుంది. అయినా కూడా వారు ఇంత పెడుతున్నారు అంటే ఖచ్చితంగా అది వారి కంటెంట్ మీద ఉన్న నమ్మకం తోనే అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలు అన్నీ ఎలాంటి ఫలితాలు అందుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











