RRR సినిమా కంటే హై రేంజ్ లో రాధేశ్యామ్.. ప్రభాస్ ఒక్కడితోనే మరో నెంబర్ వన్ రికార్డ్!
ఈ ఏడాది రావాల్సిన రాధేశ్యామ్ RRR సినిమాలు రెండూ కూడా సంక్రాంతి బరిలో పోటీ గా తలపడుతున్నాయి. తప్పకుండా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకు ఉంటాయని ప్రేక్షకుల్లో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. అయితే రాధేశ్యామ్ మిగతా సినిమాల కంటే కాస్త ఎక్కువ స్థాయిలో అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. దాదాపు రెండు కూడా బిగ్ బడ్జెట్ సినిమా కావడంతో అన్ని విషయాల్లోనూ కూడా ప్రేక్షకులు తేడాలను గమనిస్తున్నారు. ఇక రాధేశ్యామ్ సినిమా విడుదల కాకముందు ఒక విషయంలో ప్రభాస్ నెంబర్ వన్ రికార్డును బ్రేక్ చేశాడు.

RRR రికార్డు
గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకధీరుడు రాజమౌళి మెగా నందమూరి కలయికలో ఒక బిగ్గెస్ట్ మల్టిస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. RRR సినిమాపై మొదటి నుంచి కూడా అన్ని వర్గాల ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు తప్పకుండా ఎవరూ ఊహించని రేంజ్ లో అయితే ఓపెనింగ్స్ అందుతాయని చెప్పవచ్చు. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ అంతే 24 గంటల్లోనే 20.45 మిలియన్ వ్యూవ్స్ అందుకుంది.

RRR కంటే ఎక్కువగా..
ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరపైకి రాబోతున్న మూడవ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా భారీ స్థాయిలో వ్యూవ్స్ కూడా అందుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక భారీ స్థాయిలో ఈ వ్యూవర్షిప్ అందుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గా రాధేశ్యామ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా ట్రైలర్ కూడా RRR కంటే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకోవడం విశేషం.

బాహుబలి 2 రికార్డ్ బ్రేక్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కలిసి నటించిన RRR సినిమా కంటే కూడా ప్రభాస్ ఒక్కడే ఒక సరికొత్త రికార్డును ఇటీవల బ్రేక్ చేశాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్స్ లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న ట్రైలర్ గా రాధేశ్యామ్ మొదటి స్థానంలో నిలిచింది. గతంలో బాహుబలి 2 పేరు మీద ఉన్న 21.81M ను రాధేశ్యామ్ ఇరవై రెండు గంటల్లోనే బ్రేక్ చేయడం విశేషం.

నెంబర్ వన్ ట్రైలర్..
ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నా కూడా ప్రభాస్ ఒక్కడే తన తన పాన్ ఇండియా హోదాతో రాధేశ్యామ్ తెలుగు ట్రైలర్ ను మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు. రాధే శ్యామ్ ట్రైలర్ కు 22 గంటల్లోనే 22 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. దీన్ని బట్టి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా మూడు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంక్రాంతి బిగ్ ఫైట్..
జనవరి 7వ తేదీన RRR సినిమా విడుదల అవుతుండగా జనవరి 14వ తేదీన రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు సినిమాలకు మధ్యలో కేవలం ఏడు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. దీంతో ఏ సినిమా ఎక్కువ స్థాయిలో ప్రభావం చూపుతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ సినిమాపై ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. దీంతో సంక్రాంతి బరిలో పోటీ మరింత రసవత్తరంగా మారింది. మరి ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











