twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతీ పుట్టిన రోజును పండగలా.. ఘనంగా దాసరి జయంతి వేడుకలు..

    |

    శతాధిక చిత్రాల దర్శకుడు, ప్రముఖ నటుడు దాసరి నారాయణరావు 77వ జయంతిని తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా నిర్వహించింది. మే 4 తేదీ ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌ ఎదుట ఉన్న స్వర్గీయ దాసరి విగ్రహానికి సినీ ప్రముఖులు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఆయనను స్మరించుకొన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి కుమారుడు అరుణ్ కుమార్, సినీ ప్రముఖులు కొమర వెంకటేష్, రాజేంద్ర కుమార్; బంగారు బాబు, పీడీ ప్రసాద్; రామసత్యనారాయణ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

    దాసరి జయంతి వేడుకల సందర్భంగా నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచిన దాసరి జయంతిని డైరెక్ట‌ర్స్ డేగా గతంలో తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌క‌టించింది. ఈ క‌రోనా వ‌ల్ల డైరెక్ట‌ర్స్ అంద‌రూ లేకుండా సింపుల్‌గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఘనత మా గురువు గారు దాస‌రి గారికే చెల్లింది. సినీ ఇండ‌స్ట్రీలో దాసరి గారి పేరు గుర్తుండేలా వచ్చే ఏడాది బర్త్ డేకి ప‌లు మంచి ప‌నులు చేస్తాం అని వెల్ల‌డించారు.

     Tollywood pays tribute to Dasari Narayana Rao on his 77th birthday

    అనంతరం కొమ‌రం వెంక‌టేష్ మాట్లాడుతూ దాస‌రి గారి లాంటి మంచి మ‌న‌సున వ్య‌క్తులు అతి అరుదుగా క‌నిపిస్తారు. దాస‌రితో త‌నకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేనిది అని అన్నారు. ఈ సందర్భంగా తన అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. దాస‌రి గారు నాకు దేవుడితో స‌మానం. ఆయ‌న లేని లోటు సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

     Tollywood pays tribute to Dasari Narayana Rao on his 77th birthday

    అనంత‌రం తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ దాస‌రి నారాయ‌ణ రావు గారి లాంటి ద‌ర్శ‌కులు ఇక‌పై సినీ ప‌రిశ్ర‌మ‌లో వస్తారో రారో తెలియదు. ఆయ‌న మా గురువు గారు అవ్వ‌డం మా అదృష్ట‌మ‌ని చెప్పారు. సంక్రాంతి..ద‌స‌రా పండుగ‌ల్లాగే దాస‌రి గారి జ‌యంతిని ప్ర‌తి ఏటా పండుగ‌లా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్యాకెట్స్ ను కూడా కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచారు.

    English summary
    Tollywood pays tribute to Dasari Narayana Rao on his 77th birthday. Amid Corona lockdown, Few film personalities are attended a program which held at Hyderabad film chamber.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X