'ఫైట్ మొదలు పెట్టకు.. స్టార్ట్ చేశాంటే నాశనం వరకు వదలకు'

టాలీవుడ్‌లో పర్సంటేజీ సిస్టమ్ వివాదం రోజు రోజుకూ మరింత వేడెక్కుతోంది. టాలీవుడ్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న పర్సంటేజీ సిస్టమ్ వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. మొదట వ్యాపార పరమైన చర్చగా ప్రారంభమైన ఈ అంశం ఇప్పుడు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను ప్రస్తావిస్తూ ఎగ్జిబిటర్లు నిర్వహించిన ప్రెస్ మీట్ ఈ వివాదానికి నాంది పలికింది. తమకు సరైన రెవెన్యూ షేర్ అందడం లేదని, మల్టీప్లెక్స్ వ్యవస్థ పెరగడంతో సింగిల్ థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని వారు వాదించారు. ఈ వివాదం మధ్యలో తాజాగా ఏషియన్ సునీల్ చేసిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు చేయాలనే అంశం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఈ విషయంపై ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య విభేదాలు మరింత బహిరంగంగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఏషియన్ సునీల్ నారంగ్, శిరీష్ వంటి ప్రముఖ ఎగ్జిబిటర్లు ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సింగిల్ థియేటర్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని, వాటిని కాపాడాలంటే పర్సంటేజీ విధానం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Tollywood Percentage Row Heats Up Asian Suniel s No Compromise Warning Goes Viral

అయితే.. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ సమావేశంపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. భారీగా మల్టీప్లెక్స్‌లు నిర్మించిన వ్యక్తులు ఇప్పుడు సింగిల్ స్క్రీన్ సమస్యల గురించి మాట్లాడటం విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. "ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మల్టీప్లెక్స్‌లు కట్టేసి, సింగిల్ థియేటర్లకు రావాల్సిన ఆదాయాన్ని తగ్గించి, ఇప్పుడు వాటి కష్టాల గురించి మాట్లాడటం సరదాగా ఉంది" అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెస్ మీట్ గురించి ఏషియన్ సునీల్ నారంగ్ ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ సందర్భంగా అసలు నిర్మాత నాగవంశీ పేరే తనకు తెలియనట్టుగా మాట్లాడారు. పరోక్షంగా నాగవంశీని విగ్గు పెట్టుకుంటాడని వ్యాఖ్యానించారు. 'ఒక‌ ప్రొడ్యూసర్ ఉంటాడు కదా.. ఆయన పేరేంటి? స్పెక్ట్స్ పెట్టుకుని,బాల్డ్ హెడ్ వేసుకుని,డూప్లికేట్ హెయిర్ ఉంటది. సారీ.. నాగవంశీ.. ఆయన ఇందాక ఏదో అన్నాడు.. 'నేను ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టీఫ్లెక్స్ కట్టేస్తా' అంట.తన వద్ద ఇప్పటికే 30కు పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయని, ఇంకా ఐదు థియేటర్లు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు.

అదనంగా మరికొన్ని థియేటర్లను బుక్ చేసుకున్నామని, సింగిల్ స్క్రీన్ రంగం బతికేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ థియేటర్ల అభివృద్ధి కూడా అవసరమేనని కౌంటర్ వేశారు. ఇలా నాగవంశీపై పరోక్షంగా వ్యక్తిగతంగా కూడా వ్యాఖ్యలు చేయడం ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది. ఆయన పేరు గుర్తు లేనట్లుగా మాట్లాడటం, లుక్‌పై కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వివాదం కేవలం వ్యాపార అంశంగా కాకుండా వ్యక్తిగత స్థాయికి చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక్కడితో ఆగకుండా తాజాగా ఏషియన్ సునీల్ నారంగ్ తన వాట్సాప్ డిస్‌ప్లే పిక్చర్‌ను మార్చడం ఈ వివాదానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. 'నా తండ్రి నాకు నేర్పింది ఒకటే.. ముందుగా ఎప్పుడూ గొడవ మొదలు పెట్టొద్దు... కానీ ఎవరైనా బలవంతం చేస్తే వారిని పూర్తిగా ఓడించాలి' అనే కోట్‌తో ఉన్న డీపీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ స్టేటస్‌ను చాలామంది ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన ఇండైరెక్ట్ వార్నింగ్‌గా భావిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ డీపీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సునీల్ తన స్టాండ్‌పై నిలబడుతున్నాడనే సంకేతంగా చూస్తుంటే, మరికొందరు పరిస్థితిని మరింత వేడెక్కించేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సున్నితమైన సమయంలో ప్రముఖులు కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదే సమయంలో ఈ మొత్తం వివాదం 'పెద్ది' సినిమా రిలీజ్‌కు ముందు జరుగుతుండటం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. భారీ ప్రమోషన్లతో ఇప్పటికే హైప్‌లో ఉన్న ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఇండస్ట్రీ పొలిటిక్స్ కూడా కలవడం గమనార్హం. కొందరు ఈ వివాదం సినిమా బజ్‌ను పెంచే అవకాశం ఉందని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది రంగానికి నెగటివ్ ఇమేజ్ తీసుకురావొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్సంటేజీ సిస్టమ్ అనే వ్యాపార సమస్య ఇప్పుడు ఇగో క్లాష్‌గా మారుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన సమయంలో పరస్పర విమర్శలు కొనసాగితే ఇండస్ట్రీ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా? లేక మరింత పెద్ద స్థాయికి చేరుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X