నిర్మాతగా మారుతున్న దర్శకుడు వేణు ఊడుగుల.. అల్లు అరవింద్‌ను ఆహా అనిపించేదుకు రెడీ
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా రోజురోజుకి ఓటీటీల హవా ఎక్కువవుతోంది. భవిష్యత్తులో ఎక్కువగా థియేటర్స్ రిలీజ్ కంటే కూడా ఓటీటీ రిలీజ్ లు ఎక్కువ అవుతాయని ముందు జాగ్రత్తగా కొంతమంది నిర్మాతలు ఒక ఫ్లాట్ ఫార్మ్ సెట్ చేసుకుంటున్నారు. ఇక స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఆహా యాప్ డెవలప్ కోసం మంచి ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇప్పటికే తమన్నాతో ఒక టాక్ షో చేయాలని డిసైడ్ అయిన అల్లు అరవింద్ చిన్న బడ్జెట్లో అందరిని ఆకట్టుకునే డిఫరెంట్ సినిమాలను నిర్మించాలని కూడా చూస్తున్నారు. వీలైనంత వరకు ఆహా యాప్ లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక అందుకోసం ఇప్పటికే కొంత మంది దర్శకులకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగులతో కూడా ఒక వెబ్ సిరీస్ ని సెట్ చేసుకున్నట్లు టాక్.

చలం మైదానం నవల ఆధారంగా ఒక వెబ్ సిరీస్ ని నిర్మించి దాన్ని ఆహా యాప్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక దర్శకుడు వేణు ఉడుగుల ఆ ప్రాజెక్టును డైరెక్ట్ చేయడం లేదట. కేవలం అల్లు అరవింద్ తో కలిసి నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేణు విరాటపర్వం సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా అయిపోగానే వేణు ఆహా యాప్ కోసం కొత్త వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేయనున్నాడు. మరి అల్లు అరవింద్ ఈ ప్లాన్స్ తో ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











