రెండు వ్యాక్సిన్స్ తర్వాత అల్లు అరవింద్‌కు కరోనా పాజిటివ్.. త్రివిక్రమ్‌కు కూడా అంటూ వార్త వైరల్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కరోనావైరస్ బారిన పడ్డారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఆయనకు వైద్య పరీక్షలు జరిపించగా కోవిడ్ 19 పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించినట్టు సమాచారం. అయితే ఆయన రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత అల్లు అరవింద్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

అల్లు అరవింద్‌కు రెండుసార్లు వ్యాక్సిన్
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ ముప్పు పెరిగిపోవడంతో సెలబ్రిటీలతోపాటు సాధారణ ప్రజలు కూడా వ్యాక్సిన్ వేసుకోవడం కొద్ది నెలలుగా జరుగుతున్నది. అయితే అల్లు అరవింద్ కూడా ఇటీవల రెండుసార్లు వ్యాక్సిన్ వేసుకోవడం జరిగిందంట. అయినా ఆయన కరోనావైరస్ బారిన పడటంతో గందరగోళం నెలకొన్నది. ఇదే నిజమైతే వైద్య వర్గాల్లోనూ ఆసక్తిని రేపే అవకాశం లేకపోలేదు.

అధికారికంగా స్పందిస్తే క్లారిటీ
అయితే అల్లు అరవింద్ కరోనావైరస్ బారిన పడ్డారనే విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మీడియాలో మాత్రం ఈ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఒకవేళ గీతా ఆర్ట్స్ ప్రతినిధులు గానీ, అల్లు అరవింద్ సన్నిహితులు స్పందిస్తే ఈ వార్తపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మీడియాలో గందరగోళంగా
అల్లు అరవింద్‌కు కరోనావైరస్ పాజిటివ్ అనే వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించగా.. వారి పీఆర్ వర్గాలు అందుబాటులోకి రాలేదు. అయితే మీడియా వర్గాల్లో మాత్రం ఈ వార్త మరింత గందరగోళంగా నింపింది. అధికారికంగా సమాచారం లభిస్తే ఈ గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కూడా అంటూ...
ఇదిలా ఉండగా, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల కరోనావైరస్ బారినపడ్డారనే మరో వార్త కూడా మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే ఆయన కూడా వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత పాజిటివ్ రావడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజలుకు ఆ వైరస్ నుంచి తేరుకొని నెగిటివ్‌గా వచ్చిందనే వార్త తెలుగు మీడియాకు సంబంధించిన వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











