ప్రభాస్ ఛాన్స్ ఇస్తే భయపడ్డ బండ్ల గణేష్.. డిజాస్టర్ నుంచి తెలివిగా తప్పించుకున్నాడు!

చాలా రోజుల తరువాత బండ్ల గణేష్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పై రకరకాల కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న బండ్ల గణేష్ ఇటీవల ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి అలాగే భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించాడు. అయితే ఒకనోక సమయంలో ప్రభాస్ సినిమాను నిర్మించే ఛాన్స్ వస్తే భయపడి వదిలేసుకున్నాడట. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడం విశేషం..

ఆ దర్శకుడితో సినిమా చేయను..

ఆ దర్శకుడితో సినిమా చేయను..

ఇటీవల బండ్ల గణేష్ డైరెక్టర్ హరీష్ శంకర్ మధ్య ట్విట్టర్ లో వార్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా ఆ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'ఎన్నో అనుకుంటూ ఉంటాం..వాటిని ఎక్కువగా సీరియస్ గా తీసుకోను. అయితే హరీష్ శంకర్ తో మాత్రం మళ్ళీ భవిష్యత్తులో సినిమా చేయను అని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చాడు.

కొత్త దర్శకులను పరిచయం చేస్తా..

కొత్త దర్శకులను పరిచయం చేస్తా..

బండ్ల గణేష్ టెంపర్ తరువాత మరో సినిమా చేయలేదు. అయితే త్వరలోనే మంచి బాక్సాఫీస్ హిట్టుతో బిజీ అవుతానని చెబుతున్నాడు గణేష్. ముఖ్యంగా కొత్త దర్శకులతో వర్క్ చేయాలని ఉందని బండ్ల గణేష్ పేరు మీద ఒక పది మంది మంచి దర్శకులు ఇండస్ట్రీకి గుర్తుండిపోయేలా పరిచయం చేస్తానని చెప్పారు.

ప్రభాస్ తో సినిమా క్యాన్సిల్

ప్రభాస్ తో సినిమా క్యాన్సిల్

గబ్బర్ సింగ్ సినిమా తరువాత ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని ప్రాజెక్టులు అనుకోకుండా నా తప్పు వల్లే క్యాన్సిల్ అయ్యాయి. అందులో ప్రభాస్ సినిమా ఒకటి. ఆయనే పిలిచి మరి అవకాశం ఇచ్చారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమా చేయడానికి నేను భయపడ్డాను. ఆ విదంగా క్యాన్సిల్ అవ్వడంతో ఓ మంచి స్టార్ హీరోతో నేను సినిమా మిస్ చేసుకున్నాను అనే బాధ ఉంది.. అని బండ్ల గణేష్ తెలిపాడు.

Recommended Video

Mahanati Director Nag Ashwin On Liquor Selling In Theatre & Multiplexes
తెలివిగా తప్పించుకున్నాడు.

తెలివిగా తప్పించుకున్నాడు.

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులను బట్టి నడుచుకోకపోతే నిర్మాతలకు నష్టాలు తప్పవు మరికొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. అయితే బండ్ల గణేష్ ప్రభాస్ తో చేయాల్సిన సినిమా మరొక నిర్మాత చేసి భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నాడు. ఆ సినిమా మరేదో కాదు... రెబల్. ప్రభాస్ కృష్ణంరాజు కలిసి నటించిన ఆ సినిమా భారీగా నష్టాలను మిగిల్చాడమే కాకుండా దర్శక నిర్మాతలకు మధ్య పలు వివాదాలను క్రియేట్ చేసింది. కథ మీద అలగే ఆ సినిమా బడ్జెట్ ప్లాన్ మీద బండ్ల గణేష్ కి అనుమనం రావడంతో తప్పుకున్నాడు. పిలిచి మరి అవకాశం ఇచ్చిన ప్రభాస్ మాటకు గణేష్ విలువ ఇవ్వలేకపోయినప్పటికి నష్టాల నుంచి తెలివిగానే తప్పించుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X