మనోజ్ రెండో భార్య కొడుకనే మోహన్ బాబు అలా వ్యవహరిస్తున్నారా? టాలీవుడ్ ప్రొడ్యూసర్ క్లారిటీ ..

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి మంచు మోహన్ బాబు. ఇలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. స్వయంకృషితో ఎదిగి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన వారసులు కూడా నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకుని కొనసాగుతున్నారు ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీ కూడా మంచి గుర్తింపు ఉంది. కానీ, మోహన్ బాబు కుటుంబంలో కలకలం చెలరేగింది వారి మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవలు రావడం అందరికీ షాక్ గురించి చేసింది. ఈ నేపథ్యంలో మంచి ఫ్యామిలీ వివాదాలపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ చిట్టి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.

గత రెండు రోజులుగా మంచి వారి ఫ్యామిలీలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సోమవారం నాడు హైదరాబాదు శివారులలోని జల్లుపల్లి లోని వారి ఫామ్ హౌస్ మంచు హౌస్ ను ఆయన కుమారుడు మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మనోజ్ పై దాడి జరిగిందనే వార్తలను నేపథ్యంలో ఆదివారం నాడు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మంచు మనోజ్ చేరి చికిత్స తీసుకున్నారు.

Tollywood producer Chitti Babu made shocking comments on Manchu family disputes

హాస్పిటర్ నుంచి డిశ్చార్జ్ అయిన మంచు మనోజ్ వెంటనే తన బౌన్సర్లతో కలిసి మంచు ఫామ్ హౌజ్ ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఘటన జరిగినా తర్వాత మంచు మోహన్ బాబు కూడా వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అందులో తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తుల నుండి తనకు ప్రాణహాని ఉందని, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు మోహన్ బాబు.

ఈ నేపథ్యంలో మంచు మనోజ్ .. మోహన్ బాబు రెండో భార్య కొడుకు కాబట్టే.. ఇలా వ్యవహరిస్తున్నారనీ, విష్ణును దగ్గరికి తీస్తూ.. మనోజ్ ను దూరం పెడుతున్నానని వాదనలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు టాలీవుడ్ ప్రోడ్యూసర్ చిట్టిబాబు ఖండించారు. మోహన్ బాబు అలాంటి తారతమ్యాలను ఎన్నడూ చూపించలేదని, ఆయన పిల్లలు ఏ భార్య కొడుకులు కూడా ఇండస్ట్రీలో సరిగా తెలియదని, ఆ బేధం రాకుండా వారినీ చూసుకున్నారని పేర్కొన్నారు. మోహన్ బాబు రెండో భార్య కూడా పిల్లల పట్ల ఈనాడు వ్యత్యాసం చూపలేదని, తన అక్క బిడ్డల్ని చాలా బాగా చూసుకునేదని వెల్లడించారు.

అయితే.. మంచు విష్ణు రోజురోజుకీ డెవలప్ కావడం, తన వ్యాపారాలను విస్తరించడం, అటు ప్రొడక్షన్ హౌసింగ్ ప్రారంభించడం, విద్యాసంస్థలలో పెట్టుబడులు పెట్టడంతో వృద్ది లోకి వచ్చారని, మోహన్ బాబు ఆశయాలకు అనుగుణంగా విష్ణు నడుచుకుంటున్నాడని పేర్కొన్నాడు. కానీ, మనోజ్ తండ్రి ఫేమ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయాడని, తన అన్న ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాడని, అందుకే నేడు లేని ఆరోపణలు చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Tollywood producer Chitti Babu made shocking comments on Manchu family disputes

ఈ క్రమంలోనే యూనివర్సిటీ లో అవకతవకలు జరుగుతున్నాయని, తనకు ఆస్తిలో వాటా ఇవ్వడం లేదంటూ రోడ్డుకిక్కారని ఆరోపించారు. ఇవి కేవలం ఆస్తు విషయంలో జరుగుతున్న గొడవలు మాత్రమేనని, ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు సర్వసాధారణం అంటూ తేల్చేశారు చిట్టిబాబు. ఇప్పటికైనా మనోజ్ తన స్వభావాన్ని మార్చుకోవాలని, అనవసరంగా తన అన్నపై పడి ఏడవడం మానేయాలని సూచించారు.

అలాగే మనోజ్ ప్రేమ వివాహాన్ని మోహన్ బాబు అంగీకరించలేదనీ, కానీ మొండికేసి మనోజ్ భూమా రెడ్డి కూతుర్ని పెళ్లి చేసుకోన్నారనీ, ఆమె మొదటి పెళ్లి సమయంలో విడాకులు తీసుకున్న విధానం నచ్చలేదని అందుకే ఆ పెళ్లికి మోహన్ బాబు అంగీకరించలేదని చిట్టిబాబు పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X