హోరాహోరీగా కొనసాగిన నిర్మాతల మాండలి ఎన్నికలు.. దిల్ రాజు అండతో అతని గెలుపు!

సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్నికలు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే నిర్మాతల మండలి ఎలక్షన్స్ ఆ మధ్య కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు నిర్మాత మండలిలో రెండు గ్రూపులుగా చీలికలు రావడంతో ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇక మొత్తానికి నేడు ఎన్నికలు ముగిసాయి. దిల్ రాజు సారధ్యంలో నిలబడిన వారు అత్యధిక స్థాయిలో ఓట్లు అందుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

విభేదాలు రావడంతో..

విభేదాలు రావడంతో..

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాత మండలి ఎప్పటినుంచో కొనసాగుతోంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా రెగ్యులర్ గా సినిమాలు చేసే నిర్మాతలు ప్రొడ్యూసర్ గిల్డ్ అనే మరొక అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఇక ఎప్పటి నుంచో నిర్మాతల మధ్యలో తీవ్రస్థాయిలో విభేదాలు అయితే తలెత్తుతున్నాయి. ఇక ఈసారి శ్రీ కళ్యాణ్ అలాగే దిల్ రాజు వర్గాల మధ్య ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.

అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్

అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్


ఇక నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ 339 ఓట్లు అందుకొని గెలిచారు. ఇక ఆయనకు పోటీగా జెమినీ కిరణ్ కేవలం 315 ఓట్లు మాత్రమే అందుకున్నారు. 15 ఓట్ల తేడాతోనే దామోదర్ ప్రసాద్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా గెలుపును సాధించడం విశేషం. ఇక ఎన్నికలు కూడా నిర్మాతలు చాలా రోజుల ముందు నుంచే ప్రచారాలు కూడా చేయడం విశేషం.

ముందుగానే ప్రచారాలు

ముందుగానే ప్రచారాలు

నిర్మతల భవిష్యత్తు కోసం అలాగే వారి కుటుంబ పరిస్థితి కోసం ఆర్థికంగా వెనుకబడిన సీనియర్ నిర్మాతలకు కూడా అండగా ఉండేందుకు తమను గెలిపించాలని అందరూ ఓట్లను ఉపయోగించుకోవాలి అని దిల్ రాజు ముందే చెప్పారు. ఇక నిర్మాత మండలిలో ఉన్నవారు అలాగే అధ్యక్ష పదవికి పోటీలు నిలబడ్డ వారు ప్రచారాలు చేశారు. ఇక మొత్తానికి దిల్ రాజు, సి కళ్యాణ్ రెండు వర్గాల మధ్య పోటీ నెలకొనగా ఇందులో దిల్ రాజు టీమ్ వైసిపి సాధించింది.

ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా..

ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా..


ఇక ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా సుప్రియ అశోక్ గెలుపొందడం విశేషం. ఆయనకు రెండు వర్గాల నుంచి మద్దతు అందడంతో ఆ పదవిని ఆయన ఏకగ్రీవంగా పదవిని అందుకున్నారు. ఇక ట్రెజరర్ గా కూడా పలువురు నిర్మాతలు పోటీలో నిలువగా రామసత్యనారాయణ గెలుపొందారు.

హనరబుల్ సెక్రటరీ

హనరబుల్ సెక్రటరీ


హనరబుల్ సెక్రెటరీ పదవి కోసం రెండు వర్గాల నుంచి ప్రముఖ నిర్మాతలు పోటీ పడ్డారు. ప్రసన్నకుమార్ వైవిఎస్ చౌదరి గెలుపొందారు. ప్రసన్నకుమార్ 378 ఓట్లు అందుకోగా వైవిఎస్ చౌదరి 362 కోట్లు అందుకొని ఈ సెక్రటరీ హోదాలను సొంతం చేసుకున్నారు. ఇక జాయింట్ సెక్రటరీగా భరత్ చౌదరి 412 ఓట్లు అందుకోగా.. నటి కుమార్ 247 ఓట్లు అందుకొని ఇద్దరు కూడా గెలుపొందారు.

ఈసీ మెంబర్స్ లో దిల్ రాజు విజయం

ఈసీ మెంబర్స్ లో దిల్ రాజు విజయం

ఇక ఈసీ మెంబర్స్ గా నిలబడిన దిల్ రాజు 471లో అందుకోగా దానయ్య 421 ఓట్లు, రవి కిషోర్ 419 ఓట్లు, యాలమంచలి రవి 416 ఓట్లు, పద్మిని 413 ఓట్లు, బెక్కం వేణుగోపాల్ 416 ఓట్లు, సురేందర్ రెడ్డి 396 ఓట్లు, గోపీనాథ్ అచంట 353 ఓట్లు, మధుసూదన్ రెడ్డి 347 ఓట్లు, కేశవరావు 323 ఓట్లు, శ్రీనివాస్ వచ్చా 306 ఓట్లు, అభిషేక అగర్వాల్ 297 ఓట్లు, కృష్ణ తోట 293 ఓట్లు, రామకృష్ణ గౌడ్ 286 ఓట్లు, కిషోర్ పూసలు 285 ఓట్లను సొంతం చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X