Salaar వారితో కుమ్మక్కై దోచుకొంటారా? సలార్ టికెట్ రేట్ల వివాదంపై.. పోసానిపై నట్టి కుమార్ ధ్వజం

ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృస్ణ మురళీపై నిర్మాత నట్టి కుమార్ ధ్వజమెత్తారు. ఏపీలో సినీ పరిశ్రమకు మీ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏమిటి? అని ప్రశ్నించారు. మీరు చేసిన సేవ గురించి చెప్పకొకుండా జనసేన, పవన్ కల్యాణ్, కాపుల విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని నట్టి కుమార్ నిలదీశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఎఫ్‌డీసీ చైర్మన్‌గా మీరు ఏం చేశారు? ఏం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? అనే విషయాన్ని చెప్పాలంటూ పోసానిపై నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. ఏపీకి సినీ పరిశ్రమను తరలిస్తున్నారు? గోదావరి జిల్లాలో ఎప్పుడు స్టూడియో కడుతున్నారు? వైజాగ్‌కు రాజధానిని ఎప్పుడు తరలిస్తున్నారు? తిరుపతిలో స్టూడియో ఎప్పుడు కలుగుతున్నారు? అనే విషయాలను చెప్పండి అని నట్టి కుమార్ అన్నారు.

 Tollywood Producer Natti Kumar blast Posani Krishna Murali over Prabhas Salaar Ticket Rate hike?

ఎఫ్‌డీసీ చైర్మన్‌గా మీరు సినిమా వాళ్లకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీకు ఏం చేయలేకపోతున్నారు. కేవలం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను తిట్టడానికే పోస్టు ఇచ్చినట్టు ఉన్నారు. అలాంటి వ్యక్తి మీరు కూడా మాట్లాడితే ఎలా? మీరు అనుభవం కలిగి ఉన్నారు? సినిమా పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. కానీ ఏం చేయలేదు. మేము ఏమీ చేయలేనని చెప్పి మీరు చేతులు ఎత్తేసి.. జనసేనను, పవన్ కల్యాణ్‌ను తిట్టండి అంటూ సూచించారు.

 Tollywood Producer Natti Kumar blast Posani Krishna Murali over Prabhas Salaar Ticket Rate hike?

మనం అభివృద్ది చేయకుండా.. మరొకరిని అనడం తప్పు. నేను మీ మాదిరిగా బూతులు తిట్టలేను. కానీ మీరు నా స్నేహితుడు కాబట్టి నేను మీకు హితబోధ చేస్తున్నాను. సినిమా పరిశ్రమకు మీరు, మీ సీఎం, మీ ప్రభుత్వం చేసింది శూన్యం అంటూ నట్టి కుమార్ ధ్వజమెత్తారు.

సినిమా పరిశ్రమ అభివృద్దికి చిత్తశుద్ది ఉంటే.. సలార్ సినిమాకు మల్టీప్లెక్స్‌లో 200 రూపాయలు టికెట్, సింగిల్ థియేటర్‌‌కు 150 రూపాయలకు మించి పెట్టకండి. మీరు సినిమా పెద్దలకు కొమ్ము కాస్తున్నారు. చిన్న నిర్మాతలను పట్టించుకోవడం లేదు. 2.30 గంటలకు చిన్న షో ప్రదర్శించేలా సహకారం అందించలేదు. మల్టీప్లెక్స్‌లో చిన్న సినిమా ప్రదర్శించేలా చర్యలు తీసుకోలేదు అని నట్టి కుమార్ ఆరోపించారు.

 Tollywood Producer Natti Kumar blast Posani Krishna Murali over Prabhas Salaar Ticket Rate hike?

సినీ పెద్దలతో కుమ్మక్కయ్యారు. ఇది నిజం. సలార్ టికెట్లు రేట్లు తగ్గించాలి. చిన్న సినిమాలకు ప్రోత్సాహించండి. చిన్న నిర్మాతలకు బతికించండి. కార్మికులను బతికించండి. చిన్న, పెద్ద నిర్మాతలు బాగుండాలని కోరుకొంటున్నాం. మీరు జీవో తెస్తే.. మీకు పాలాభిషేకం చేస్తాను. అంతేగానీ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను తిట్టడానికి మీ పదవిని ఉపయోగించుకోకండి అంటూ నట్టి కుమార్ చెప్పారు.

సలార్ సినిమాకు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఆ సినిమాకు టికెట్ రేట్లు తగ్గిస్తూ జీవో తీసుకురండి. లేకపోతే మీరు పెద్దవారితో కుమ్మక్కయ్యారని భావిస్తాం. సలార్ టికెట్లు రేట్లు తగ్గిస్తున్నామని జీవో రాకపోతే .. చిన్న నిర్మాతను తొక్కేస్తున్నారని అనుకొంటాం. ప్రేక్షకుల నుంచి డబ్బు దోచుకొంటున్నామని భావిస్తాం. మీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు.. కార్పోరేట్ ప్రభుత్వమని అనుకొంటాం అని నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X