2024 AP elections: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. ముందే ఓటమి అంగీకరించిన టాలీవుడ్ నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా రోజులుగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఈరోజు ప్రారంభం అయింది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముందుగా మొదలైంది. ఆ తర్వాత ఈవీఎమ్‌ల కౌంటింగ్ మొదలైంది. ఇందులో ఆరంభం నుంచీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికే ఆధిక్యం కనిపిస్తోంది. ఈ లెక్కింపులో టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రొడ్యూసర్లకు బిగ్ షాక్ తగిలింది. దీంతో వాళ్లు బయటకు వెళ్లిపోయారు. ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!
ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. అంతేకాదు, ఎవరూ ఊహించని రీతిలో 160 పైచిలుకు సీట్లలో విజయం సాధించేలా ముందుకు సాగుతోంది. పార్లమెంట్ స్థానాల్లోనూ కూటమికే భారీ ఆధిక్యం లభిస్తోంది.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి హవాను చూపిస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ప్రముఖులు ఓటమి దిశగా సాగుతున్నారు. అందులో ముఖ్యంగా టాలీవుడ్‌లో నిర్మాతలుగా పలు చిత్రాలను నిర్మించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ తమ ప్రత్యర్థులపై చాలా ఓట్ల వెనుకంజలో ఉండిపోయారు.

గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొడాలి నానిపై, టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము, వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు ఆధిక్యాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు. దీంతో వీళ్లిద్దరూ ముందుగానే ఓటిమిని అంగీకరిస్తూ.. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. వైసీపీలో కీలక నేతలైన వీళ్లిద్దరూ వాకౌట్ చేయడం ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ అవుతోంది.


Click it and Unblock the Notifications











