twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోవిడ్19పై దిల్ రాజు, సురేష్, నాగవంశీ వార్.. బాధితుల కోసం వారు ఏం చేస్తున్నారంటే

    |

    మన దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. రోజు రోజుకీ కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్న‌ర ల‌క్ష‌ల మార్క్ దాటింది. గ‌డిచిన 24 గంటల్లో దేశంలో 3లక్షల 50 వేల కేసులకి పైగా న‌మోదు కాగా..2812 మంది మృత్యువాత ప‌డిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్ల‌డించింది. ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. అలాగే యాంటీ వైరల్ డ్రగ్స్ అయిన రెమిడిసివిర్ కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది..

    ప్రియుడిని వదిలేసి.. పెంపుడు కుక్కతో రోడ్డెక్కిన హాట్ బ్యూటీ మలైకా అరోరా


    కొన్ని రాష్ట్రాల్లో అయితే హాస్పిటల్లో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఏర్పడడంతో సినిమా నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగాయి. తమ తమ సినిమాల అప్డేట్స్, ప్రమోషన్స్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న టాలీవుడ్ నిర్మాణ సంస్థల అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆక్సిజన్ సిలిండర్ల వివరాలు, ఖాళీగా ఉన్న బెడ్స్ వివరాలు షేర్ చేయడం మొదలు పెట్టారు. అలాగే కరోనాకు సంబంధించిన వివిధ రకాల సమాచారాన్నికూడా షేర్ చేస్తున్నారు.

    Tollywood production houses busy in sharing details of oxygen and Remdesivir in social media

    ముందు ఎవరు మొదలు పెట్టారో కానీ మొత్తం మీద టాలీవుడ్ నిర్మాణం సంస్థలు అన్నీ ఇప్పుడు ఈ పనిలోనే ఉండటంతో వారి మీద నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దగ్గుబాటి సురేష్ బాబు చెందిన సురేష్ ప్రొడక్షన్స్ అల్లు అరవింద్ కి సంబంధించిన గీతా ఆర్ట్స్, అలాగే నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ ఇలా వరుస పెట్టి అందరూ అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇలా కలిసి కట్టుగా జనం కోసం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు.

    English summary
    India's new coronavirus infections hit a record high for a fifth straight day on Monday. Even telugu states situation is also becoming worse. so tollywood production houses started sharing details of oxygen and Remdesivir in social media. so that people can reach out to them easily.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X