అక్టోబర్‌లో టాలీవుడ్ మూవీస్ రిలీజ్.. థియేటర్లలో ఏ సినిమాలు విడుదల అంటే!
కరోనావైరస్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో తెలుగు సినిమా పరిశ్రమలో మళ్లీ సందడి మొదలైంది. షూటింగుల జోరు ఓ వైపు కొనసాగుతుంటే.. మరోవైపు సినిమా రిలీజ్‌లు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. సెప్టెంబర్‌లో భారీ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ మళ్లీ థియేటర్లలో పండుగ వాతవారణాన్ని క్రియేట్ చేస్తున్నాయి.
ఏపీలో టికెట్ల రేట్లు పెంపు వ్యవహారంపై చర్చ జరుగుతుండటం, త్వరలోనే అగ్ర నటులు, నిర్మాతలు, దర్శకులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటి కావడం కొంత సానుకూలంగా మారింది. చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి నటులను కూడా ఈ చర్చల్లో భాగం చేయాలని నిర్ణయించారు. అయితే ఎవరెవరూ ఈ భేటికి వెళ్తున్నారనే విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సినిమా పరిశ్రమలో సానుకూల వాతావరణం నెలకొన్నది. సెప్టెంబర్ 24వ తేదీన లవ్ స్టోరి లాంటి పెద్ద సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు.
ఈ క్రమంలో కేవలం సెప్టెంబర్ 17వ తేదీన రికార్డు స్తాయిలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్లాన్ బీ, గల్లీ రౌడీ, విజయ్ రాఘవన్ చిత్రాలు థియేటర్లో రిలీజ్ అయితే.. మ్యాస్ట్రో చిత్రం డిస్నీ+ హాట్ స్టార్‌లో రిలీజ్ కాగా, ప్రియురాలు ఓటీటీ సోని లివ్, అన్ హార్డ్ ఎస్1 హాట్ స్టార్‌లో కనపడుటలేదు స్పార్క్‌లో, అన్నాబెల్లే సేతుపతి హాట్ స్టార్‌లో రిలీజ్ అయ్యాయి. ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రం ఆహాలో రిలీజ్ అయ్యాయి.

ఇక అక్టోబర్ మాసంలో కూడా భారీగా సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఇందులో అగ్ర హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి.
అక్టోబర్ 1వ తేదీన -- సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. యాక్సిడెంట్ గురైన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
అక్టోబర్ 8వ తేదీన .... అక్కినేని అఖిల్, పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఎట్టకేలకు పలు వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది.
అక్టోబర్ 8వ తేదీన... క్రిష్ దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కొండపొలం చిత్రం థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఉప్పెన తర్వాత విడుదలవుతున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ఇది.
అక్టోబర్ 13వ తేదీ.. వెంకటేష్ నటించిన దృశ్యం 2 చిత్రం రిలీజ్ అవుతున్నది. గతంలో ఈ చిత్రంలో రిలీజ్ కావాల్సి ఉండగా, థియేటర్ల మూసివేత కారణంగా రిలీజ్ ఆగిపోయింది.
అక్టోబర్ 14వ తేదీన.. RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం థియేటర్లలో రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ నటించారు.
అక్టోబర్ మాసంలో దసరా పండుగ కూడా రావడంతో తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడుతున్నది. ఈ క్రమంలో గత కొద్దికాలంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమాలు రిలీజ్‌కు నోచుకొంటున్నాయి. ప్రేక్షకుల ఈ సినిమాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











