twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌ను వెంటాడిన మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు కన్నుమూత

    |

    టాలీవుడ్ పరిశ్రమను మరో విషాదం వెంటాడింది. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మరణం సినీ ప్రముఖులను కలిచి వేస్తున్నది. దశాబ్దకాలానికిపైగా తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న కేఎస్ నాగేశ్వరరావు ఆకస్మిక మృతి విషాదం మిగిల్చింది. కేఎస్ నాగేశ్వర రావు మరణం నేపథ్యంలో తన సన్నిహితులు, స్నేహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. కేఎస్ మృతికి సంతాపం తెలియజేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. కేఎస్ నాగేశ్వరరావు మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    కేఎస్ నాగేశ్వరరావు గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. నిన్న నవంబర్ 26న ఏలూరు నుండి తిరిగి వస్తూ.. ఫిట్స్ వచ్చి అకస్మాత్ గా కుప్పకూలిపోయారు.. వెంటనే ఆయన్ను దగ్గరలో వున్న హాస్పటల్ కు హుటా హుటిన తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రం మృతి చెందారు.. ఇవాళ ఆయన స్వస్థలం అయిన కోయిలగుడేం దగ్గరలో వున్న పోతవరంలో నేడు (27వ తేది) ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి అని కుటుంబ సభ్యులు తెలిపారు.

    ప్రముఖ దర్శకుడు, నటుడు వీర శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కేఎస్ నాగేశ్వరరావు మరణ వార్తను తెలియజేశారు. ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడుతూ... మా గురువుగారి శిష్యుడు, మా చిరకాల మిత్రుడు, ప్రముఖ దర్శకుడు కె.యస్. నాగేశ్వరరావు నిన్న ఊరు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. మార్గ మధ్యంలో ఫిట్స్ రావడంతో సీరియస్ అయింది. ఆయన కోదాడ వద్ద మరణించాడని తెలియజేయాల్సి రావడం చాలా బాధాకరంగా వుంది. ఈ ఉదయం నల్లజర్ల దగ్గరలోని కౌలురు గ్రామంలో వారి అత్తగారి ఇంటి వద్ద అంతిమ సంస్కారం జరగనుందని ఆయన కుమారుడు తెలియజేశాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని వీర శంకర్ తెలిపారు.

     Tollywoods Director KS Nageshwara Rao no more

    కేఎస్ నాగేశ్వరరావు కెరీర్ విషయానికి వస్తే.. వార్నింగ్ చిత్రంతో 1999లో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత శివన్న, దేశద్రోహి, రా, విజయశాంతి, ఇన్స్‌పెక్టర్, 786, శ్రీశైలం, బిచ్చగాడా? మజాకా? చిత్రాలకు దర్శకత్వం వహించారు. రచయితగా శ్రీశైలం, 786, ఇన్స్‌పెక్టర్, విజయశాంతి చిత్రాలకు పనిచేశారు.

    Recommended Video

    Esther Anil About Drushyam 2 Movie | OTT | Venkatesh

    విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న శ్రీహరిని పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసిన ఘనత దర్శకుడిగా కేఎస్ నాగేశ్వరరావుకు దక్కుతుంది అని బత్తుల ప్రసాదరావు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

    కేఎస్ నాగేశ్వరరావు ఆకస్మిక మృతిపై సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    దర్శకుడు కెఎస్ .నాగేశ్వరరావు మృతి పట్ల తెలంగాణా దర్శకుల సంఘం గౌరవ అధ్యక్షులు తాడివాక రమేష్ నాయుడు తన సంతాపాన్ని తెలియచేశారు.

    రమేష్ నాయుడు మాట్లాడుతూ ..
    శ్రీహరి హీరోగా శ్రీశైలం సినిమాను కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందించాను. కె.ఎస్ తీసిన అన్ని సినిమాలు కమర్షియల్‌ గా మంచి విజయాలను అందుకున్నాయి. తన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా రమేష్ నాయుడు అభివర్ణించారు. ‌

    English summary
    Tollywood's Director KS Nageshwara Rao no more. He died with fits on Travelling to hyderabad from his native place. Many film makers expressed their grief and condolence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X