twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sasanasabha టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ.. కేజీఎఫ్ యష్‌కు సోదరుడిలా.. !

    |

    టాలీవుడ్‌లో బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న హీరో ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ హీరోయిన్‌గా డాక్టర్ రాజేంద్రప్రసాద్‌, సోనియా అగర్వాల్‌, హెబ్బాపటేల్‌, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న పాన్‌ ఇండియా పొలిటికల్‌ థ్రిల్లర్‌ శాసనసభ. వేణు మడికంటి దర్శకత్వంలో సాబ్రో ప్రొడక్షన్స్‌ పతాకంపై సాప్పని బ్రదర్స్‌గా పాపులరైన తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్‌పోస్టర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు చిన్ని కృష్ణ, నిర్మాత, ఎమ్‌ఎల్‌సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌, హీరోయిన్‌ ఐశ్వర్యరాజ్‌, సోనియా అగర్వాల్‌, జగదీశ్వర్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, మురళీకృష్ణ, భూషణ్‌, మహేష్‌, మయాంక్‌ తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ 'శాసనసభ చిత్ర కథానాయకుడు ఇంద్రసేన 12 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం మంచి సెటప్‌ కుదిరింది. ఈ సినిమా ఇంద్రసేనతో పాటు టీమ్‌ అందరికి మంచి బ్రేక్‌ రావాలని కోరుకుంటున్నాను' అన్నారు.

    Tollywoods Pan India movie Sasana Sabha Motion poster unveiled

    శాసనసభ హీరో ఇంద్రసేన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ చిత్రంతో రచయిత రాఘవేంద్రరెడ్డి మంచి కమర్షియల్‌ కథ ఇచ్చాడు. నాకోసమే ఈ కథను తయారుచేసిన ఆయనకు నేను జీవితాంతం బుణపడి వుంటాను. నాకు ఎటువంటి ఇమేజ్‌ లేకున్నా నాతో ఇంత బడ్జెట్‌ పె ట్టిఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను నా జీవితంలో మరిచిపోలేను. ఈ శాసనసభ నా కెరీర్‌కు టర్నింగ్‌పాయింట్‌గా నిలుస్తుంది అని అన్నారు.

    నిర్మాత షణ్ముగం సాప్పని మాట్లాడుతూ...కథలోని కంటెంట్‌ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నాను. తప్పకుండా ఈ చిత్రం నిర్మాతలుగా మాకు మంచి గుర్తింపును తెస్తుంది అని అన్నారు.

    నటుడు పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ.. ఇంద్రసేనను చూస్తుంటే కేజీఎఫ్‌ హీరో యష్‌కు సోదరుడిలా ఉన్నాడు. ఈ చిత్రంలో దర్శకుడు నాకు విభిన్నమైన విలన్‌ పాత్రను డిజైన్‌ చేశాడు. రాజేంద్రప్రసాద్‌, సోనియా అగర్వాల్‌ పాత్రలు కూడా ఎంతో బాగా కుదిరాయి. త్వరలో అందరం ఓ అద్భుతమైన సినిమను చూడబోతున్నాం అని అన్నారు.

    రచయిత రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ.. 25 సంవత్సరాలు జర్నలిస్ట్‌గా, పీఆర్‌వోగా పనిచేశాను. శాసనసభ చిత్రంతో రచయితగా మారాను. అద్బుతమైన కథ కుదిరింది. ఈ కథను బాగా నమ్మింది ఇంద్రసేన. ఇక అదే నమ్మకంతో నిర్మాతలు ఈ సినిమాను ఖర్చుకు వెనకడాకుండా రిచ్‌గా నిర్మించారు. కేజీఎఫ్‌ ఫేమ్‌ రవి బసురు సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఇంద్ర రూపంలో ఓ మంచి యాక్షన్‌ హీరో దొరికాడు. తప్పకుండా ఇది అందరిని అలరించే చిత్రమవుతుంది అని అన్నారు.

    దర్శకుడు వేణు మడికంటి మాట్లాడుతూ.. నిర్మాతలు భారీ ఖర్చుతో శాసనసభ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తర్వాత తెలుగు సినీ పరిశ్రమ బెస్ట్‌ హీరోల్లో ఇంద్రసేన కూడా ఉంటాడు. ఈ వేడుకుకు నా అభిమాన దర్శకుడు సురేందర్‌ రెడ్డి రావడం సంతోషంగా ఉంది అని అన్నారు.

    English summary
    Sasana Sabha movie will be produced by Thulasi Ram Sappani and Shanmugam Sappani, popularly known as Sappani Brothers, on their Sabro Production Pvt Ltd banner of Sapbro Group. Indra Sena, Aishwarya Rajesh are lead in this film. Writtnen Raghavendra Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X